Google     Gmail     EPDS     Aadhaar       PAN    W.QR Code     PAN Record  

Rice or Roti | రాత్రి పూట అన్నం తినాలా? లేక చపాతి తినాలా? - Telugu Pencil

 

Rice or Roti : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది తినే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువలన చాలా మంది ఆహారపు అలవాట్లలో కీలక మార్పులు చేసుకుంటున్నారు. కొంత మంది రాత్రి సమయంలో చపాతీని తీసుకోవడానికి ఆసక్తి చూపితే మరి కొందరు భోజనం తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

     సాధారణంగా జనం తీసుకునే ఆహారపదార్థాలు వారి ప్రాంతాలను బట్టి మారుతుంది. కాని చాలా వరకు అందరు తినే ప్రధాన ఆహారం అన్నం, మన దేశంలో అయితే ఎక్కువ శాతం అన్నం ముఖ్య ఆహార పదార్ధం. అయితే ఉత్తర భారతదేశ ప్రజలు అన్నంకు బదులుగా ఇతర ఆహార పదార్థాలు స్వీకరిస్తారు.

        దక్షిణ భారతదేశ ప్రజలు మాత్రం భోజనంలో అన్నం తప్పకుండా ఉండాల్సిందే. అయితే ఇటివల కాలంలో చాలా మంది రాత్రి పూట అన్నంకు బదులుగా చపాతీలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రాత్రిపూట అన్నం తింటే మంచిదా? చపాతి తింటే మంచిదా? అనే విషయాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

Table of Contents

Rice or Roti     

     రాత్రి సమయంలో చపాతీ మంచిదా? లేక భోజనం మంచిదా? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. ఎవరైతే బరువు తగ్గాలని అని అనుకుంటున్నారో వాళ్లు చపాతీలను తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పెరుగు, కూరగాయలు, పప్పుతో చపాతీలను తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చపాతీలలో శరీరానికి అవసరమైన జింక్, కాల్షియం, ఫాస్పరస్ లాంటివి ఉంటాయి. రాత్రి సమయంలో త్వరగా భోజనం చేయడం మంచిది.  

     చపాతీ(రోటీ)లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఫైబర్ ఉండటం వలన చపాతీలు తినేవాళ్లకు త్వరగా ఆకలి వేయదు. ఇప్పుడు పాలిష్ బియ్యం తినడం వలన శరీరానికి అవసరమైన పోషకాలు లభించడం లేదు. ప్రోటీన్ వినియోగం పెంచి కార్బోహైడ్రేట్లను తగ్గిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

     మధ్యాహ్న సమయంలో రైస్ తీసుకున్నా పర్వాలేదు కాని రాత్రి సమయంలో మాత్రం తప్పనిసరిగా చపాతీలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో చపాతీలు తినాలా? అన్నం తినాలా? (Rice or Roti ) అని కన్ఫ్యూజ్ అయ్యేవాళ్లు ఈ విషయాలను గుర్తించుకోవాలి.

     బియ్యం, గోధుములు ఆహార విషయంలో రెండూ ప్రధానమైనవే. ఇవి లేకుండా ఆహారం అసంపూర్ణం… కానీ బరువు తగ్గే విషయానికి వస్తే, మొదట ఈ రెండు ఆహారాలపైనే దృష్టి పెడతాం, ఎందుకంటే ఈ రెండింటిలో బరువు తగ్గటానికి ఏది ఎక్కువ సహాయపడుతుందో అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఈ రెండూ కార్బోహైడ్రేట్స్‌తో నిండి ఉంటాయి. అయితే, బరువు తగ్గడానికి ముఖ్యంగా కార్బోహైడ్రేట్‌స్‌ని తక్కువగా తీసుకోవాలి. వంటకాల్లో మనం నిత్యం తీసుకునే ఆహారాల్లో కార్బోహైడ్రేట్‌స్‌ అధికంగా ఉండి, ప్రోటీన్స్ తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రోటీన్స్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్‌స్‌ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.

roti-telugu-pencil
గోధుమపిండి చపాతీలు

     చాలా మంది రాత్రి పూట అన్నంకు బదులు చపాతీ మంచిది అని చెబుతున్నారు. అన్నం కంటే గోధుమ పిండిలో మూడు రెట్లు ఎక్కువగా కార్బోహైడ్రేట్లు 10 రెట్లు అధికంగా పొటాషియం ఉంటాయి. వరి అన్నం కంటే గోదుమల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అంటే రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా ఇది సహకరిస్తుంది. అన్నం కంటే చపాతీలో 6 రెట్లు ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన మెల్లగా అరుగుతుంది, అందువలన ఎక్కువ సమయం ఆకలి వేయదు. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. మధుమేహవ్యాధి ఉన్నవారిని ఇవి ఇబ్బందులకు గురిచేస్తాయి. గోదుమలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బోహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి. అందుకే అన్నం కంటే చపాతీలు ఆరోగ్యానికి మంచివి. చాలా మంది రాత్రి పూట చపాతీ ఆరోగ్యానికి మంచిదని అంటారు. అయితే రాత్రి 7 గంటల లోపే చపాతీలను తినేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే మీ శరీరానికి ఏది బాగా సరిపోతుందో ముందుగా మీరు తెలుసుకోవడం అవసరం.

   వరి పంట ద్వారా వచ్చిన బియ్యం నుంచి అన్నం వండుతాం అని అందరికి తెలిసిందే. గోధుమ పిండితో చేసిన చపాతీల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అన్నంతో పోలిస్తే 5 రెట్లు ఎక్కువగా ప్రోటీన్స్ చపాతీల్లో ఉంటాయి. గోధుమలలో ఉండే కార్బోహైడ్రేట్స్, పొటాషియం ఆరోగ్యంకి చాలా అవసరం. అన్నం గోధుమ పిండి రెండిటిలో ఫైబర్ ఉన్నప్పటికీ అన్నంతో పోలిస్తే గోధుమ 6 రెట్లు ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అందువలనే చపాతీలు తింటే చాలా సేపు వరకు ఆకలి వేయదు. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలో కలిసి త్వరగా ఆకలి వేస్తుంది. 

రాత్రి నూనె లేని చపాతీలే ఆరోగ్యం

    Rice or Roti గోధుమలలో ఉండే పైబర్ వల్ల డైజేషన్ నెమ్మదిగా జరుగుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది బరువు తగ్గడానికి రాత్రి సమయంలో అన్నంకి బదులుగా చపాతీలు తీసుకుంటున్నారు. అయితే ఈ చపాతీలు తినేవాళ్లు నూనె తక్కువ మోతాదులో వాడాలి. కుదిరితే చపాతీలను నూనె లేకుండానే కాల్చి తింటే మంచిది. ఫుల్ మీల్స్ ఉండే శక్తి మూడు చపాతీలు తింటే లభిస్తుంది.

    Rice or Roti గోధుమలలో ఉండే విటమిన్స్ E, B మరియు ఖనిజాలు అయినా కాపర్, మాంగనీస్, సిలికాన్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ వంటివి ఉంటాయి. ఐరన్ వల్ల బ్లడ్‌లో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. 

రాత్రి తిన్న వెంటనే నిద్రపోతే

    Rice or Roti  అన్నం తిన్న వెంటనే పడుకోకూడదు. రాత్రి సమయం అయిపోయింది అనే ధ్యాసలో తిన్న వెంటనే పడుకుంటున్నారు. కానీ అలా చేయకూడదు. భోజనానికి నిద్ర పోవడానికి మధ్య కనీసం గంట లేదా అరగంట సమయం ఉండేలా చూసుకోవాలి.

     అన్నం కంటే చపాతీలు అరగటానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి చపాతీలు రాత్రి పూట తీసుకోవాలి అంటే కనీసం ఒక గంట తర్వాత నిద్రపోవాలి. గోధుమ పిండితో చేసిన చపాతీలో ఐరన్ ఉండటం వలన హార్ట్ కి చాలా మంచిది.

రాత్రిపూట చపాతీలు తినొచ్చా?

        Rice or Roti అని చాలా మంది ఆలోచించి అన్నంకి బదులుగా చపాతీలను రాత్రి సమయంలో తీసుకోవడం మంచిదే కానీ ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల లోపు మాత్రమే చపాతీలను తినాలి. కానీ రాత్రి 7 గంటల కంటే ముందే చపాతీలను తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పగటి పూట ఎక్కువ చపాతీలను తీసుకున్న పర్లేదు కానీ రాత్రి పూట మాత్రం కొంచెం తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే డైజెషన్‌కు ఎక్కువ సమయం పడుతుంది, కావున రాత్రి పూట చపాతీలను తక్కువ తీసుకోవాలి.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!

Welcome

This is the English version of the post.