Google     Gmail     EPDS     Aadhaar       PAN    W.QR Code     PAN Record  

IND vs USA T20WC Match Preview: గెలిస్తే.. సూపర్ 8.. నేడే అమెరికా వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్

 

IND vs USA Dream11 Predictions T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా మూడో మ్యాచ్ అమెరికాతో ఆడనుంది. న్యూయార్క్ వేదికగా జరిగే మ్యాచ్ పై మళ్లీ అంచనాలు పెరిగిపోయాయి. అందుక్కారణం ఏమిటంటే, అమెరికా చేతిలో పాకిస్తాన్ మట్టి కరవడమే. ప్రస్తుతం అమెరికా జట్టులో సగం మంది ప్రవాస భారతీయులే ఉన్నారు. అయితే వాళ్లలో ఐదుగురు.. నేటి మ్యాచ్ లో ఆడనున్నారు.
నిజానికి టీమ్ ఇండియా బలాలు, బలహీనతలు వాళ్లకి బాగా తెలుసు. రెండవది న్యూయార్క్ పిచ్ ఇంకా మనవాళ్లకి కొరుకుడు పడటం లేదు. కొమ్ములు తిరిగిన విరాట్ కొహ్లీ లాంటి బ్యాటర్లు సింగిల్ డిజిట్ కే అవుట్ అయిపోతున్నారు.

అటువైపు అమెరికాకు సొంత మైదానం కావడం కలిసి వచ్చేలా ఉంది. వారికి డ్రాప్ ఇన్ పిచ్ లపై ఆడిన అనుభవం ఉంది. ఈజీగా రన్స్ తీస్తున్నారు. అందుకని టీమ్ ఇండియా కొంచెం జాగ్రత్తగానే ఆడాల్సి ఉంటుంది. గెలిచిన జట్టు ఏదైనా సరే.. సూపర్ 8 కి డైరక్టుగా వెళుతుంది.

ఇక అమెరికా టీమ్ లో భారత సంతతి ఆటగాళ్లయిన సౌరభ్ నేత్రావాల్కర్, హర్మీత్ సింగ్, నితీశ్ కుమార్, కెప్టెన్ మోనాంక్ పటేల్, జస్ దీప్ సింగ్ ఉన్నారు. పాకిస్తాన్ మ్యాచ్ లో మోనాంక్ పటేల్ హాఫ్ సెంచరీ చేశాడు. నేత్రా వాల్కార్ సూపర్ ఓవర్ వేసి గెలిపించాడు. వీరు కాకుండా అమెరికా స్పిన్నర్ కెంజిగేతో అప్రమత్తంగా ఉండాలి. తనకి సులువుగా వికెట్లు వస్తున్నాయి.  వీరిని ఎదుర్కోవడానికి టీమ్ ఇండియా ప్రణాళికలు రచించాలి.

ఇక ఇండియా విషయానికి వస్తే.. విరాట్ కొహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ ఫామ్ లోకి రావాలని భగవంతుడిని ప్రార్థించాలని నెటిజన్లు పేర్కొంటున్నారు. బౌలింగులో బుమ్రా, పాండ్యా కీలకం కానున్నారు. అయితే భారత్- అమెరికా మధ్య జరుగుతున్న మొదటి మ్యాచ్ ఇదే కావడం విశేషం. అందువల్ల టీమ్ ఇండియా గెలవాలని కోరుకుందాం. అలాగే అమెరికా కూడా సూపర్ 8 కి చేరుకుని ముందడుగు వేయాలని కోరుకుందాం.

ఎందుకంటే అమెరికాలాంటి అగ్రదేశం క్రికెట్ లో తొలిసారి అడుగుపెట్టింది. అందువల్ల ఆ దేశం గెలుస్తుంటే, వారికి ప్రోత్సాహం లభిస్తుంది. అలా క్రికెట్ కి మంచి జరుగుతుందని నెటిజన్లు అంటున్నారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!