Google     Gmail     EPDS     Aadhaar       PAN    W.QR Code     PAN Record  

SS Rajamouli: 'కల్కి 2898 AD' సినిమా చూసిన ఎస్‌ఎస్‌ రాజమౌళి - డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌పై ఆసక్తికర కామెంట్స్‌, ఏమన్నారంటే..

 Director Rajamouli Review on Kalki Movie: డైరెక్టర్‌ రాజమౌళి కల్కి మూవీపై తన రివ్యూ ప్రకటించారు. నేడు ఈ సినిమా చూసిన ఆయన తన ట్విటర్‌ వేదికగా తన ఎక్స్‌పీరియన్స్‌ని పంచుకున్నారు.



SS Rajamouli Interesting Comments on Nag Ashwin: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'కల్కి 2898 AD'. మూవీ లవర్స్‌ అంత ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ సినిమా నేడు(జూన్‌ 27) థియేటర్లోకి వచ్చింది. ఫస్ట డే ఫస్ట్‌ షో నుంచి థియేటర్లు హౌజ్‌ ఫుల్‌గా ఉన్నాయి. ఆడియన్స్‌ నుంచి కూడా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంటుంది. మరోవైపు రికార్డుల వేట కూడా మొదలుపెట్టింది. ఫస్ట్‌ డే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లు రాబట్టేలా ఉంది. అప్పుడే ఓవర్సిస్‌లో వసళ్లు కోత మొదలెట్టింది. ఫస్ట్‌ డే కలెక్షన్స్‌లోనే ఏకంగా ఆర్‌ఆర్‌ఆర్‌, సలార్‌ సినిమాలను దాటేసింది.


ప్రీమియర్స్‌తోనే ఆర్‌ఆర్ఆర్‌ క్లోజింగ్‌ కలెక్షన్స్‌ రాబట్టి రికార్ట్‌ నెలకొల్పింది. ఇక కల్కి ఇదే జోరు కొనసాగితే మాత్రం వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద వసూళ్ల సునామే అంటున్నారు ట్రేడ్‌ పండితులు.  ఇదిలా ఉంటే మొదటి నుంచి కల్కి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సాధారణ ఆడియన్స్‌ మాత్రమే కాదు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం కల్కి సినిమా చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. ఈ క్రమంలో నేడు కల్కి సినిమా చూసిన దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి మూవీపై తన రివ్యూ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో వేదికగా ఆయన పోస్ట్‌ చేస్తూ.. కల్కి ప్రపంచం తనని ఆశ్చర్య పరిచిదంటూ నాగ్‌ అశ్విన్‌ పనితనాన్ని కొనియాడారు.

'కల్కి 2898 AD' కోసం సృష్టించిన ప్రపంచం నాకు బాగా నచ్చింది. అద్భుతమైన సెట్టింగ్‌లతో ఇది నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది.  ఇక 'డార్లింగ్' తన టైమింగ్‌, టాలెంట్‌తో ఇరగదీశాడు. అమితాబ్ జీ, కమల్ సర్, దీపిక నుంచి గ్రేట్‌ సపోర్ట్ దొరికింది. ఇక చివరి 30 నిమిషాలు సినిమా  నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అనుకున్నది అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్‌ చేసిన నాగి, అలాగే మొత్తం వైజయంతి టీంకు నా అభినందనలు' అంటూ జక్కన్న మూవీపై ప్రశంసలు  కురిపించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా జక్కన్న అతిథి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అశ్వద్ధామ పాత్రకు ఆయన గురువు పాత్రలో నటించారు.



కనిపించింది కొన్ని క్షణాలే అయినా ఈ సీన్‌ సినిమాలో ఇంటెన్సీవ్‌ సీన్స్‌లో ఇది ఒకటి అని చెప్పాలి అంటున్నారు ఆడియన్స్‌. కాగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై నిర్మాత అశ్వినీ దత్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. దీపికా పదుకొనె హీరోయిన్‌గ నటించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌, లోకనాయకుడు కమల్‌ హాసన్‌, సీనియర్‌ నటి శోభన, దిశా పటానీలు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక రామ్‌ గోపాల్‌ వర్మ, విజయ్‌ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, మాళవిక నాయర్‌,  దుల్కర్‌ సల్మాన్‌ వంటి స్టార్స్‌ అతిథి పాత్రలో కనిపించి కాసేపు అలరించారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!