Sagar: నిండుకుండలా మారిన సాగర్.. గేట్లు ఎత్తడానికి అధికారుల సన్నాహాలు

Sagar: నిండుకుండలా మారిన సాగర్.. గేట్లు ఎత్తడానికి అధికారుల సన్నాహాలు

P Madhav Kumar

  Sagar: నిండుకుండలా మారిన సాగర్.. గేట్లు ఎత్తడానికి అధికారుల సన్నాహాలు

గత వారం రోజులుగా శ్రీశైలం జలాశయానికి భారీ వరద వస్తుండటంతో 10 గేట్లను ఎత్తి 5 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం పూర్తి స్థాయికి చేరుకుంటుంది. రేపు సాయంత్రానికి సాగర్ నిండనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 573 అడుగులకు చేరుకుంది. అలాగే సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 264 టీఎంసీలు దాటింది. ప్రస్తుతం శ్రీశైలం నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో.. రేపు సాయంత్రానికి డ్యామ్ పూర్తి స్థాయిలో నిండనుంది. దీంతో రేపు, లేదా ఎల్లుండి సాగర్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై డ్యామ్ అధికారులు ప్రకటన చేయాల్సి ఉండగా.. ఇప్పటికే సాగర్ నిండుతుండటంతో ఆయకట్టు రైతులు సంబరాల్లో మునిగిపోయారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow