AP Common Entrance Tests 2025 : ఏపీ విద్యార్థులకు అలర్ట్ - ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు, మే 19 నుంచి 'ఈఏపీసెట్‌'ఎగ్జామ్స్

AP Common Entrance Tests 2025 : ఏపీ విద్యార్థులకు అలర్ట్ - ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు, మే 19 నుంచి 'ఈఏపీసెట్‌'ఎగ్జామ్స్

P Madhav Kumar

మ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యామండలి తేదీలను ప్రకటించింది. ఇందులో భాగంగా 2025-26 విద్యా సంవత్సరంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. కీలకమైన ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు మే 19 నుంచి ప్రారంభమవుతాయి.

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు - తేదీలు ఖరారు
ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు - తేదీలు ఖరారు

ఏపీ విద్యార్థులకు ఉన్నత విద్యామండలి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ ఏడాదికి సంబంధించిన ఎంట్రెన్స్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ వివరాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… కీలమైన ఈఏపీసెట్ పరీక్షలు మే 19 నుంచి 27 తేదీ వరకు జరగనున్నాయి. ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్‌) స్ట్రీమ్ పరీక్ష మే 21 నుంచి 27వరకు ఉంటుంది. ఇక అగ్రికల్చర్‌, ఫార్మా స్ట్రీమ్ పరీక్ష మే 19, 20 తేదీల్లో జరగనుంది. ఏపీఐసెట్ మే 7వ తేదీన, లాసెట్ మే 25వ తేదీన నిర్వహిస్తారు.

ఉమ్మడి ప్రవేశ పరీక్షలు - తేదీలు:

  • ఏపీఆర్ సెట్ మే 2 నుంచి 5వ తేదీ వరకు ఉంటుంది.
  • ఏపీ ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్‌ స్ట్రీమ్ ) పరీక్ష- మే 21 నుంచి 27వరకు ఉంటుంది.
  • ఏపీ ఈఏపీసెట్ (అగ్రికల్చర్‌, ఫార్మా స్ట్రీమ్) పరీక్ష - మే 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు.
  • ఏపీఈసెట్ మే 6వ తేదీన ఉంటుంది.
  • ఏపీఐసెట్ - 7 మే 2025
  • ఏపీలాసెట్ 25 మే 2025
  • ఏపీపీజీఈసెట్ - 5, 7 జూన్ 2025
  • ఏపీ ఎడ్‌సెట్‌ - జూన్‌ 8
  • ఏపీపీజీసెట్‌ - జూన్‌ 9 నుంచి 13 వరకు
  • ఏపీపీఈసెట్‌ - జూన్‌ 25
  • ఏపీ ఎడ్‌సెట్‌ - జూన్‌ 8
  • ఏపీపీఈసెట్‌ - 25 జూన్‌ 2025.

ప్రవేశ పరీక్షల కన్వీనర్లు:

ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ నిర్వహణ బాధ్యతలను ఈ ఏడాది జేఎన్‌టీయూ కాకినాడ చూడనుంది. కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ వీవీ సుబ్బారావు నియమితులయ్యారు. ఇటీవలనే 8 ప్రవేశ పరీక్షలకు సంబంధించిన కన్వీనర్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow