తెలంగాణ లాసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఇవాళ పూర్తిస్థాయి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి 9 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆగస్టు 16వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.

రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. వారి ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందుకు సంబంధిచిన షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.
టీజీ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ - ముఖ్య వివరాలు
షెడ్యూల్ వివరాలం ప్రకారం… ఇవాళ లాసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఆగస్టు 4వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఇందుకు ఆగస్టు 14 వరకు గడువు ఉంటుంది. ఆగస్టు 16, 17 తేదీల్లో మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఉంటాయి. ఆగస్టు 18వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఆగస్టు 22వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు ఆగస్టు 22 కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. ఇందుకు ఆగస్టు 25 వరకు అవకాశం ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. ఆగస్టు 30వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ లాసెట్ పరీక్షకు మొత్తం 57,715 మంది అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు. వీరిలో 45,609 మంది హాజరయ్యారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి 32,118 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంకు 13,491 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు.
టీజీ లాసెట్ రిజల్ట్స్ - ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి
- పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయాలి.
- హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- వ్యూ ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే ఫలితం డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.