TG B Pharmcy Admissions: తెలంగాణ బీఫార్మసీ కౌన్సిలింగ్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న సీట్లపై స్పష్టత రావడంతో 7835సీట్లను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఫార్మసీ, బయోటెక్నాలజీ, బయో మెడికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలను చేపడతారు.
TG B Pharmcy Admissions: తెలంగాణలో బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో 7,835 బీ ఫార్మసీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ బైపీసీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో 121 ఫార్మసీ కళాశాలల్లో 7,835 బీ ఫార్మసీ సీట్లు అందుబా టులో ఉన్నాయి. అక్టోబర్ 19వ తేదీ నుంచి ఫార్మసీ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో 72 కళా శాలల్లో 1449 ఫార్మా డీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2 కళాశాల్లో 51 బీటెక్ బయోమెడి కల్ సీట్లు, 4 కళాశాలల్లో 166 బయో టెక్నాలజీ సీట్లు ఉన్నాయి. ఒక కళాశాలల్లో 30 ఫార్మాస్యూటికల్ సీట్లు ఉన్నాయని వివరించారు.
తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీ సెట్ 2024లో బైపీసీ స్ట్రీమ్ విద్యార్థుల కోసం ఫార్మసీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. బీఫార్మసీ, డీ ఫార్మసీ, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రాసెసింగ్ ఫీ చెల్లింపు, స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదుకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ ఈఏపీ సెట్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి నోటిఫికేషన్ కోసం లింకును అనుసరించండి..
B. ఫార్మసీ, ఫార్మ్ D, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బయో-మెడికల్ ఇంజనీరింగ్, బయో-టెక్నాలజీ కోర్సులలో అడ్మిషన్ కోరుకునే TGEAPCET-2024 (Bi.P.C) అర్హత పొందిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబర్ 19న ప్రారంభం అవుతుంది. TGEAPCET-2024 (Bi.P.C)లో అర్హత సాధించని లేదా హాజరుకాని మైనారిటీ అభ్యర్థులు, 10+2 పరీక్షలో B.P.C గ్రూప్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులైన వారు కూడా కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చు.
మొదటి విడత అడ్మిషన్ షెడ్యూల్
ఫార్మసీ, బయో-మెడికల్ ఇంజనీరింగ్, బయో టెక్నాలజీ కోర్సుల్లో అడ్మిషన్లకు మొదటి విడతలో అక్టోబర్ 19 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల నమోదు, ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ నిర్వహిస్తారు.
అక్టోబర్ 21 నుంచి 23 వరకు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
అక్టోబర్ 21 నుంచి 25వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు.
అక్టోబర్ 25న ఆప్షన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 28 లోగా సీట్ల అలాట్‌మెంట్ కేటాయిస్తారు. అక్టోబర్ 28 నుంచి 30తేదీల మధ్య ట్యూషన్ ఫీజు చెల్లింపు, కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
తుది విడత అడ్మిషన్ షెడ్యూల్...
తుది విడతలో అడ్మిషన్లను నవంబర్ 4న నోటిఫికేషన్ అందుబాటులోకి వస్తుంది. అదే రోజు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 5వ తేదీన హెల్ప్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు.
నవంబర్ 5,6 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలి. 6వ తేదీన వాటిని ఖరారు చేయాల్సి ఉంటుంది. నవంబర్ 9న సీట్లను కేటాయిస్తారు. నవంబర్ 9-11 తేదీల మధ్య కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటంది.
ప్రైవేట్ ఫార్మసీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో నవంబర్ 12న స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తారు. మైనార్టీ కాలేజీల్లో ఈఏపీ సెట్ 2024 కు హాజరు కాకపోయినా ఇంటర్ బైపీసీలో ఉత్తీర్ణులైన వారికి ప్రవేశాలను కల్పిస్తారు. మైనార్టీ కోటాలో దరఖాస్తు చేసే ఓసీ విద్యార్ధులకు ఇంటర్‌లో 45శాతం, ఇతరులకు 40శాతం మార్కులు ఉండాలి. మైనార్టీ కోటాలో అడ్మిషన్లు పొందే విద్యార్ధులకు ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తించదు.
కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులకు తెలంగాణలోని 21 జిల్లాల్లో హెల్ప్‌లైన్ సెంటర్లను పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఈ కేంద్రాల్లో సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. కేంద్రాల జాబితాకు ఈ లింక్ అనుసరించండి.