
NHAI Stenographer Library & Information Assistant & Accountant Recruitment 2025 Apply Online : రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ)లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. NHAI వెబ్‌సైట్ (https://www.nhai.gov.in) లో అందుబాటులో ఉన్న వివరణాత్మక ప్రకటనలో సూచించిన విధానం ప్రకారం దరఖాస్తుదారుడు 15.12.2025 నాటికి (సాయంత్రం 06:00 గంటల వరకు) ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) లో డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్), లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, అకౌంటెంట్ & స్టెనోగ్రాఫర్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం ఆన్లైన్ లో అప్లికేషన్ ప్రారంభ తేదీ 30 అక్టోబర్ 2025 ఉదయం 10:00 గంటల నుండి అప్లికేషన్ చివరి తేదీ 15 డిసెంబర్ 2025 వరకు https://www.nhai.gov.in ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మాత్రమే ఆహ్వానించబడింది. నెల జీతం 25,500/- to 1,77,500/- ఇస్తారు. వయోపరిమితి, అర్హత ప్రమాణాలు, ఇతర షరతులు మొదలైన వివరాలను NHAI వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
NHAI నోటిఫికేషన్ లో వయసు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. మొత్తం పోస్టులు 84 ఉన్నాయి. అర్హత ఏదైనా డిగ్రీ, డిగ్రీలో లైబ్రరీ సైన్స్, MBA ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లు అప్లికేషన్ ఫీజు రూ.500/- మరియు SC/ST/PWD అభ్యర్థులకు రుసుము చెల్లించకుండా మినహాయింపు ఉంది. ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. చక్కటి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే పర్మనెంట్ ఉద్యోగాలు పొందుతారు.
ఖాళీ పోస్టుల సంఖ్య : మొత్తం ఖాళీల సంఖ్య 18 . వీటిలో డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) -09 పోస్టులు, లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 01 పోస్టులు, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్- 01 పోస్టులు, అకౌంటెంట్ – 42 పోస్టులు & స్టెనోగ్రాఫర్ -31 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
నెల జీతం :
•డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) = రూ.56,100-1,77,500/-
•లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ = రూ.35,400-1,12,400/- పోస్టులు,
•జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ = రూ.35,400-1,12,400/-
•అకౌంటెంట్ = రూ.29,200-92,300/-
•స్టెనోగ్రాఫర్ = రూ.25,500-81,100/- నెల జీతం ఇస్తారు.
విద్యా అర్హత :
•డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) = గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి రెగ్యులర్ కోర్సు ద్వారా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఫైనాన్స్) (MBA (ఫైనాన్స్)}.
•లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ = గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ.
•జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ = డిగ్రీ స్థాయిలో ఇంగ్లీషు తప్పనిసరి లేదా ఎంపిక చేసిన సబ్జెక్టుగా లేదా పరీక్షా మాధ్యమంగా హిందీలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీష్‌లో మాస్టర్స్ డిగ్రీ, హిందీని తప్పనిసరి లేదా ఎంపిక చేసిన సబ్జెక్టుగా లేదా డిగ్రీ స్థాయిలో పరీక్షా మాధ్యమంగా ఉత్తీర్ణత.
•అకౌంటెంట్ = గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ మరియు చార్టర్డ్ అకౌంటెంట్ (CA) లో ఇంటర్మీడియట్ లేదా కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ (CMA) లో ఇంటర్మీడియట్.
•స్టెనోగ్రాఫర్ = గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా మరియు 80 పదాల సంక్షిప్తలిపి (ఇంగ్లీష్ లేదా హిందీ) వేగంతో 05 నిమిషాల డిక్టేషన్ మరియు ట్రాన్స్క్రిప్షన్ సమయం మాత్రమే) ఇంగ్లీషుకు 50 నిమిషాలు మరియు 65 నిమిషాలు ఉండాలి.


ముఖ్యమైన తేదీ వివరాలు
•రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ మరియు సమయం : 30 అక్టోబర్ 2025
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ : 15 డిసెంబర్ 2025
ఎలా అప్లై చేయాలి : NHAI వెబ్‌సైట్ (https://www.nhai.gov.in) లో అందుబాటులో ఉన్న వివరణాత్మక ప్రకటనలో సూచించిన విధానం ప్రకారం దరఖాస్తుదారుడు 15.12.2025 నాటికి (సాయంత్రం 06:00 గంటల వరకు) ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాలి.
Notification Pdf Click Here
Apply Link Click Here
Office Website Click Here
