పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు! రైల్వేలో 5,349 ఉద్యోగాలు. | Railway Recruitment Cell Western Railway: 5,349 Apprentice Vacancies Announced

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు వెస్ట్రన్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. Western Railway పరిధిలో మొత్తం 5,349 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 23 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరించబడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ Railway Recruitment Cell Western Railway ద్వారా దరఖాస్తు చేయాలి. https://www.rrc-wr.com/
కనీసం 50 శాతం మార్కులు..

అర్హతల విషయానికి వస్తే, కనీసం 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరి. 10వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. ఐటీఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ (NCVT/SCVT) కలిగి ఉండాలి. వయస్సు పరిమితి 15 నుంచి 24 సంవత్సరాల మధ్యగా నిర్ణయించారు. రిజర్వేషన్ గల వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
f