TG Model School Hall Tickets : తెలంగాణ మోడల్ స్కూల్ హాల్ టికెట్లు విడుదల - ఎగ్జామ్ తేదీ, డౌన్లోడ్ లింక్ వివరాలు

P Madhav Kumar

Telangana Model School Hall Tickets 2026 : తెలంగాణ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. telanganams.cgg.gov.in వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. ఏప్రిల్ 19వ తేదీన ఎగ్జామ్ నిర్వహిస్తారు.

TG Model School Hall Tickets 2026 : తెలంగాణ మోడల్‌ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. తాజాగా హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఆరో తరగతి ఎంట్రెన్స్ తో పాటు 7వ తరగతి నుంచి పదో తరగతి ప్రవేశాలకు సంబంధించి హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

ఈ నోటిఫికేషన్ ద్వారా 2026 -27 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 7నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి కూడా ఎగ్జామ్ ఉంటుంది.


మోడల్ స్కూల్ ఎగ్జామ్ హాల్ టికెట్ - ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

ముందుగా

https://telanganams.cgg.gov.in/

వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

హోం పేజీలోని ఆరో తరగతి, 7 నుంచి 10వ తరగతి నోటిఫికేషన్ల చివరిలో హాల్ టికెట్ లింక్ ఉంటుంది.

అభ్యర్థి ఐడీ, పుట్టిన తేదీ లేదా మొబైల్ నెంబర్, అభ్యర్థి పేరు వివరాలను ఎంట్రీ చేయాలి.

సబ్మిట్ చేస్తే హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా హాల్ టికెట్ కాపీని పొందొచ్చు.

ఏప్రిల్ 19న ఎంట్రెన్స్ టెస్ట్…

ఏప్రిల్ 19న తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ 2026 జరగనుంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఇంగ్లీష్-మీడియం విద్యను అందించడానికి ఈ మోడల్ స్కూల్స్ ఏర్పాటయ్యాయి. ఈ పాఠశాలలు 6 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు రాష్ట్ర సిలబస్‌తో పనిచేస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి.




మోడల్ స్కూల్ ఆరో తరగతి ప్రవేశాలకు 100 మార్కుల ఎగ్జామ్ ఉంటుంది. తెలుగు, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలుంటాయి. ఇందుకు సంబంధించిన ఫలితాలను https://telanganams.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారానే వెల్లడిస్తారు.
Tags
f