Anganwadi Jobs : నిరుద్యోగ మహిళలకు భారీ శుభవార్త.. 15,982 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ చర్యలు

Anganwadi Jobs : రాష్ట్రంలో 35,781 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో 71,562 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో టీచర్లు, వర్కర్లు సమానంగా ఉంటారు. గత మూడేళ్లుగా పదవీ విరమణ, సిబ్బందికి సూపర్ వైజర్లుగా పదోన్నతులు, కొందరికి ఇతర విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలు రావడంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

  • నిరుద్యోగ మహిళలకు తెలంగాణ సర్కార్ శుభవార్త
  • త్వరలో 15,982 పోస్టుల భర్తీకి చర్యలు
  • ఆమోదం లభించిన వెంటనే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు

Anganwadi Jobs : తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో 15,982 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో అంగన్వాడీ సహాయకుల పోస్టులు 12,882 కాగా.. అంగన్వాడీ టీచర్ పోస్టులు 3,100 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read : Gold silver Price Today : బంగారం ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

రాష్ట్రంలో 35,781 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో 71,562 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో టీచర్లు, వర్కర్లు సమానంగా ఉంటారు. గత మూడేళ్లుగా పదవీ విరమణ, సిబ్బందికి సూపర్ వైజర్లుగా పదోన్నతులు, కొందరికి ఇతర విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలు రావడంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేయాల్సిన సిబ్బందికి సంబంధించి 22.33శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదోన్నతులు, పదవీ విరమణతో 2025-26 ఏడాది నాటికి ఏర్పడిన ఖాళీలను పరిగణలోకి తీసుకుంటూ ఖాళీలను ప్రభుత్వం గుర్తించింది. కొత్త నియామక విధానానికి ఆమోదం లభించిన వెంటనే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

ఉద్యోగాల భర్తీతోపాటు.. అంగన్ వాడీ కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్లు, శాశ్వత భవనాలు, ఆరోగ్యం పాట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 3,300 కేంద్రాలకు తాగునీటి కనెక్షన్లు, 9వేల కేంద్రాలకు విద్యుత్ కనెక్షన్లు, 7,700 కేంద్రాలకు మరుగుదొడ్లు నిర్మాణం, వెయ్యి కేంద్రాలకు శాశ్వత భవనాలు, 5వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్వో ప్లాంట్లు, ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.

f