హోలీ పండుగ
హిందువులు జరుపుకునే పండుగలలో హోలీ పండగ ఒక్కడి. హోలీ అనేది రంగుల పండుగ, ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, ప్రవాస భారతీయులు, బంగ్లాదేశ్ లో కూడా జరుపుకుంటారు.
హోలీ పండుగ సాధారణంగా శీతాకాలం చివర్లో ఎంగ్లిష్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి లేదా మార్చి నెలలల్లో వచ్చే ఫాల్గుణమాసము పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా / దోల్ జాత్రా లేదా బసంత-ఉత్సబ్ అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్, బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి.
రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు చాలా కాలం తపస్సు చేసి తనను ఎవ్వరైననూ చంపడం అసాధ్యమయ్యేలా తప్పసు చేసి బ్రహ్మచే వరం పొందాడు. ఈ హిరణ్యకశ్యపుడును ఇంటి లోపల లేదా బయట గాని, పగలు లేదా రాత్రిగాని, భూమిపైన లేదా ఆకాశంలో గాని , మనుషుల లే కాక , జంతువుల వలన గాని , శస్త్రములచే గాని అస్త్రములు చే గాని చావు లేకుండా వరాన్ని పొందుతాడు. ఆ వరము పొందడముతో తనని ఎవరూ ఏమీ చేయలేరని దురహంకారం పెరిగి చివరకు స్వర్గం, భూమిపై దాడి చేశాడు. హిరణ్యకశ్యపుడు తననే పూజించాలని దేవుళ్ళని ఆరాధించడం మానమని ఆజ్ఞాపింస్తాడు.
హిరణ్యకశ్యపుడి తెలియదు తన మృత్యువుకు కారనం తన పుత్రుడే అవుతాడని. హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు విష్ణువుకు పరమ భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు ప్రహ్లాదుడును బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు మాత్రము విష్ణువుని పరమ భక్తితో ప్రార్థించేవాడు. చివరకు హిరణ్యకశ్యపుడు తన పుత్రుడైన ప్రహ్లాదుడు నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది. ప్రహ్లాదుడును ఏనుగులచే తొక్కించిననూ ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ప్రహ్లాదుడును ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన అన్ని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరి ప్రయత్నముగా హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టి చితిలో కుర్చుంటాది. మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. అయితే ప్రహ్లాదుడు తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది అదే శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన ప్రహ్లాదుడినికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.
ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథుర , బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు.
హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి, అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది , వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి.