GATE 2025 : గేట్ 2025 ని నిర్వహిస్తున్న ఐఐటీ రూర్కీ కీలక అప్డేట్ ఇచ్చింది. గేట్ 2025 మాక్ టెస్ట్ లింక్స్‌ని యాక్టివేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలు..

2025 గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు అలర్ట్! gate2025.iitr.ac.in గేట్ అధికారిక వెబ్సైట్లో మాక్ టెస్ట్‌కు హాజరుకావొచ్చు. ఈ మేరకు ఈసారి పరీక్ష నిర్వహిస్తున్న ఐఐటీ రూర్కీ.. గేట్ 2025 మాక్ టెస్ట్ లింక్స్‌ని యాక్టివేట్ చేసింది.
కొత్త ట్యాబ్ లేదా విండోలో మాక్ టెస్ట్ లింక్‌ని తెరవడానికి పరీక్ష పేపర్ పేరు లేదా దాని కోడ్‌పై క్లిక్ చేయండి. గేట్ 2025 కంప్యూటర్ ఆధారిత పరీక్ష రూపాన్ని, ఎక్స్‌పీరియెన్స్‌ని తెలుసుకోవడానికి గేట్ 2025 అభ్యర్థులకు సహాయపడటానికి మాక్ టెస్ట్‌ని ఉపయోగించుకోవచ్చు. మీ స్కోర్‌ని పెంచుకోవడనికి ఈ మాక్ టెస్ట్‌లు బాగా ఉపయోగపడతాయి. దీన్ని మంచి ఛాన్స్‌గా భావించి గేట్ మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
గేట్ 2025 మాక్ టెస్ట్ గేట్ 2025 కోసం డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
గేట్ 2025 మాక్ టెస్ట్‌కు ఎలా ప్రాక్టీస్ చేయాలి?
అభ్యర్థులు మాక్ టెస్ట్‌లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ స్టెప్స్‌ని అనుసరించవచ్చు.
- gate2025.iitr.ac.in ఐఐటీ గేట్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న గేట్ 2025 మాక్ టెస్ట్ లింక్లపై క్లిక్ చేయండి.
- పేపర్ల వారీగా లింకులు అందుబాటులో ఉన్న చోట కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అవసరమైన లింక్‌పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అవసరమైన వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి.
- ఒకసారి మాక్ టెస్ట్ చేసిన తర్వాత స్కోర్ డిస్ప్లే అవుతుంది.
- మాక్ టెస్ట్‌కు హాజరై సబ్మిట్పై క్లిక్ చేయాలి.
- తదుపరి అవసరాల కోసం ఫలితాల పేజీ హార్డ్ కాపీని తీసిపెట్టుకోండి.
గేట్ 2025 పరీక్షను 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో నిర్వహించనున్నారు. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్షలో 30 టెస్ట్ పేపర్లు ఉంటాయి. పరీక్ష పేపర్లలో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఒకటి లేదా రెండు పరీక్షా పేపర్లకు మాత్రమే హాజరు కావడానికి అనుమతిస్తారు.
ఒక్కో టెస్ట్ పేపర్ విలువ 100 మార్కులు. అన్ని పరీక్ష పేపర్లలో జనరల్ ఆప్టిట్యూడ్ విభాగం 15 మార్కులకు, మిగిలిన 85 మార్కులు అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుకు కేటాయిస్తారు.
గేట్ 2025 స్కోర్‌కార్డ్.. ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి మూడేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది.
మరిన్ని వివరాల కోసం గేట్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.