JEE Main 2025 Session 1 Registration : జేఈఈ మెయిన్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ మెుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ల తమ ఫారాలను సమర్పించవచ్చని ఎన్టీఏ తెలిపింది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2025 మొదటి సెషన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in.లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 జనవరిలో, సెషన్ 2 ఏప్రిల్లో జరుగుతాయని ప్రకటించిందారు. మెుదటి దశ మెయిన్స్‌కు సంబంధించి 28 అక్టోబర్ 2024 నుంచి 22 నవంబర్ 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెయిన్స్ పరీక్ష 22 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 వరకూ జరుగుతాయి. మొదటి సెషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభమైంది.
జేఈఈ మెయిన్స్ సెషన్ 1కు నవంబర్ 22 (రాత్రి 9 గంటల వరకు) దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజును ఆ రోజు రాత్రి 11:50 గంటల వరకు చెల్లించవచ్చు. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షా కేంద్రాలను జనవరి మొదటి వారంలో ప్రకటిస్తారు. ఈ పరీక్ష జనవరి 22 నుంచి 31 వరకు జరుగుతుంది.
ప్రతి పరీక్షకు మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్ 2025లో ఆప్షనల్ ప్రశ్నలు ఉండవు. ఇంజినీరింగ్ పేపర్ ను రెండు విభాగాలుగా విభజిస్తారు. సెక్షన్ ఏలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి 20 చొప్పున మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్-బీలో ఈ మూడు విభాగాల నుంచి ఐదు న్యూమరికల్ వాల్యూ టైప్ ప్రశ్నలు ఉంటాయి.
జేఈఈ మెయిన్స్ సెషన్ 1కు దరఖాస్తు చేసుకుని, రెండో సెషన్‌కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఏప్రిల్ పరీక్షకు ముందు అప్లికేషన్ విండో తెరిచినప్పుడు చూడాలి. సెషన్ 1 లాగిన్ క్రెడెన్షియల్స్ ఉపయోగించి రెండో సెషన్‌కు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తారు. ఒకవేళ అభ్యర్థి సెషన్ 2కు మాత్రమే దరఖాస్తు చేయాలనుకుంటే విండో తెరిచినప్పుడు చేసేందుకు అనుమతిస్తారు.
ఒక అభ్యర్థి కేవలం ఒక దరఖాస్తు ఫారాన్ని మాత్రమే సమర్పించడానికి అనుమతి. పలుమార్లు దరఖాస్తులు సమర్పించకూడదు.
రెండో దశ మెయిన్స్ కోసం 31 జనవరి 2025 నుంచి 24 ఫిబ్రవరి 2025 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మెయిన్స్ పరీక్ష 1 ఏప్రిల్ 2025 నుంచి 8 ఏప్రిల్ 2025 వరకు జరుగుతాయి.