JNVST Class 9 Inter Admissions : నవోదయ 9వ తరగతి, ఇంటర్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ప్రారంభం-చివరి తేదీ అక్టోబర్ 30

JNVST Class 9 Inter Admissions : నవోదయ 9వ తరగతి, ఇంటర్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ప్రారంభం-చివరి తేదీ అక్టోబర్ 30

P Madhav Kumar


నవోదయ 9వ తరగతి, ఇంటర్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ప్రారంభం-చివరి తేదీ అక్టోబర్ 30

జవహర్‌ నవోదయ విద్యాలయలో 2025-26 విద్యాసంవత్సరానికి 9వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈ అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. 9వ తరగతిలో ప్రవేశానికి 2010 మే 1వ తేదీ నుంచి 2012 జులై 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు ప్రస్తుతం 10వ తరగతి చదువుతూ... 2008 జూన్‌ 1వ తేదీ నుంచి 2010 జులై 31వ తేదీ మధ్య జన్మించి ఉండాలి.

అక్టోబర్ 30 లోపు

ఆయా జిల్లా పరిధిలోని విద్యార్థులు మాత్రమే నవోదయ విద్యాలయ అడ్మిషన్లు పొందేందుకు అర్హులు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు www. navodaya.gov.in వెబ్‌సైట్‌లో అక్టోబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు జనవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

దేశంలోని 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో సుమారు 653 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. 2025-26 విద్యాసంవత్సరానికి 9వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ లాటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్షకు హాజరు కావడానికి, విద్యార్థులు ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్టోబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. నవోదయ విద్యాలయ సమితి పరీక్షకు నమోదు చేసుకున్న వారికి మాత్రమే అడ్మిట్ కార్డులను జారీచేస్తారు.

ముఖ్య తేదీలు

  • జేఎన్వీ 9వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ దరఖాస్తులు ప్రారంభం- అక్టోబర్ 01, 2024
  • దరఖాస్తులకు చివరి తేదీ - అక్టోబర్ 30, 2024
  • జేఎన్వీఎస్టీ 9వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశ పరీక్ష తేదీ - ఫిబ్రవరి 08, 2025
  • అధికారిక వెబ్‌సైట్స్ - www.navodaya.gov.in , www.cbseitms.nic.in

జేఎన్వీఎస్టీ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు విధానం

  • Step 1 : నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్‌ www.navodaya.gov.in పై క్లిక్ చేయండి.
  • Step 2 : హోమ్‌పేజీలో “JNV క్లాస్ 9, 11 లాటరల్ ఎంట్రీ రిజిస్ట్రేషన్ 2025-26” అనే లింక్ క్లిక్ చేయండి.
  • Step 3: విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్ ఐటీ ఇతర వివరాలు నమోదు చేయండి.
  • Step 4 : అధికారిక లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను విద్యార్థి రిజిస్టర్డ్ ఈ-మెయిల్ కి పంపుతారు.
  • Step 5: విద్యార్థి వ్యక్తిగత సమాచారం, విద్యా వివరాలు నమోదు చేయాలి. ప్రవేశ పరీక్షల కోసం JNV క్లాస్ 9, 11 అడ్మిషన్ ఫారం పూరించాలి.
  • Step 6 : అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుంది.
  • Step 7: దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు తమ ఫోటోగ్రాఫ్‌, సంతకం అప్‌లోడ్ చేయాలి.
  • Step 8 : చివరిగా నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించాలి.


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow