పూల సంబరం..రెండో రోజు 'అటుకుల బతుకమ్మ'
Sunday, October 06, 2024
తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన పూల సంబరాలు మొదలయ్యాయి. ప్రతి ఇల్లు పూల రంగులతో కళకళలాడుతుంటుంది. ఎటు చూసిన జానపద గీతాల సందడులే. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రజలంతా బతుకమ్మ పండుగకు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు సంబరాలు అంబారాన్నంటేలా అంగరంగ వైభవంగా సాగాయి. ఇక రెండో రోజు అంటే ఈరోజున(అక్టోబర్ 03) అటుకుల బతుకమ్మను సిద్ధం చేసి ఆడిపాడతారు.
గునుగు పూలు, తంగేడు,బంతి, చామంతి, గుమ్మడి, బీర, కట్ల వంటి పూలతో బతుకమ్మను పేర్చి అందంగా తీర్చి దిద్దుతారు.. గౌరమ్మ పాటలతో రంగురంగుల పూలను కీర్తిస్తూ బతుకమ్మ పండుగ వేడుకగా చేసుకుంటారు.
అయితే దీన్ని చిన్నారులే ఎక్కువగా చేసుకోవడంతో ఈ బతుకమ్మకు అటుకల బతుకమ్మ అనే పేరు వచ్చిందని కథనం. అయితే పిల్లలు ఆటకు అటుకులు, పప్పులు, బెల్లమే కదా ఉపయోగిస్తారు. అందుకనే ఈ బతుకమ్మకు చిన్నిపిల్లలు ఇష్టంగా తినే అటుకులనే నైవేద్యంగా సమర్పిస్తారు.
Tags