TG TET II Updates 2024 : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - వెబ్ సైట్ లో 'మాక్ టెస్ట్' ఆప్షన్ వచ్చేసింది, ఇదిగో లింక్

TG TET II Updates 2024 : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - వెబ్ సైట్ లో 'మాక్ టెస్ట్' ఆప్షన్ వచ్చేసింది, ఇదిగో లింక్

P Madhav Kumar


TG TET II Mock Exams 2024: తెలంగాణ టెట్ అభ్యర్థులకు విద్యాశాఖ మరో అప్డేట్ ఇచ్చింది. ఉచితంగా మాక్ టెస్ట్ లు రాసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ ను తీసుకువచ్చింది. ఈ మాక్ పరీక్షలను ఎలా రాయాలో ఇక్కడ చూడండి…..
తెలంగాణ టెట్ పరీక్షలు 2024
తెలంగాణ టెట్ పరీక్షలు 2024

తెలంగాణ టెట్‌ 2024 (II) పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. విద్యాశాఖ వెబ్ సైట్ నుంచి వీటిని పొందవచ్చు. జనవరి 2వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో…. విద్యాశాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది.

తెలంగాణ టెట్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం విద్యాశాఖ ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ తీసుకొచ్చింది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి ఉచితంగా అభ్యర్థులు పరీక్షలు రాసుకునే వీలు ఉంటుంది.

టెట్ లో క్వాలిఫై కావటంతో పాటు మంచి స్కోర్ సాధించటం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకోసం చాలా మంది ఇంటి వద్దే సన్నద్ధం అవుతుంటారు. అయితే పరీక్షా విధానం, ప్రశ్నాల సరళి, సమయాభావంతో పాటు మరిన్ని విషయాలు తెలియాలంటే మాక్ టెస్టులు రాస్తే చాలా మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరహా పరీక్షలను రాయటం ద్వారా… అనేక అంశాలు మీకు కలిసివచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

టెట్ మాక్ టెస్ట్ ఆప్షన్ - ఎలా రాయాలంటే….

  1. తెలంగాణ టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tgtet2024.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో పైన కనిపించే TG TET Mock Test-2024-II అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఆప్షన్లపై క్లిస్ చేస్తే… మీకు ప్రశ్నాపత్రం ఓపెన్ అవుతుంది.
  4. ఇలా మీరు ఎన్నిసార్లు అయినా పరీక్షలను రాసుకొవచ్చు.
  5. ఈ పరీక్షలను రాయటం ద్వారా… ఆన్ లైన్ లో రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఓ అవగాహనకు రావొచ్చు.

ఈసారి టెట్ పరీక్షల కోసం మొత్తం 2,48,172 మంది అప్లికేషన్ చేసుకున్నారు. పేపర్‌-1కు 71,655 అప్లికేషన్లు రాగా… పేపర్‌-2కు 1,55,971 దరఖాస్తులు వచ్చాయి. వీరంతా కూడా జనవరి 2 నుంచి పరీక్షలు హాజరవుతారు. ఈ టెట్ పరీక్షలు జనవరి 20,2025వ తేదీతో పూర్తవుతాయి. ఫిబ్రవరి 5వ తేదీన టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు.

ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై.. 11. 30 గంటలకు ఎగ్జామ్ ముగుస్తుందని పేర్కొంది. ఇక రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై... 04. 30 గంటలకు పూర్తవుతుంది. అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే 91 7075028882 / 85 నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఈ నెంబర్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు డౌన్లోడ్ ఇలా

  • తెలంగాణ టెట్ అభ్యర్థులు schooledu.telangana.gov.in లేదా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే ' Hall Tickets(II) Download 2024 ఆప్షన్ పై నొక్కాలి.
  • జర్నల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
  • పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow