మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర - M. Visvesvaraya biography in Telugu

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర - M. Visvesvaraya biography in Telugu

P Madhav Kumar
M. Visvesvaraya biography in Telugu

బాల్యం :

విశ్వేశ్వరయ్య సెప్టెంబర్ 15,1861 వ సంవత్సరం లో శ్రీనివాస శాస్త్రి మరియు వెంకటలక్ష్మమ్మ అనే దంపతులకు కర్ణాటక లోని ముద్దెనహళ్లి గ్రామంలో జన్మించాడు.

విశ్వేశ్వరయ్య పూర్వీకులు అప్పటి మైసూర్ రాజ్యం లోని మోక్షగుండం (ఆంధ్ర ప్రదేశ్) కి చెందిన వారు. విశ్వేశ్వరయ్య పుట్టక ముందు 300 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక వెళ్లి స్థిరపడ్డాడు.

విశ్వేశ్వరయ్య పూణే లోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పూణే నుంచి తన చదువును పూర్తి చేసాడు. విశ్వేశ్వరయ్య ను పేరును చిన్నగా చేసి M.V అని కూడా పిలుస్తారు.

విశ్వేశ్వరయ్య అక్కడ చదువుతున్న సమయంలో డెక్కన్ క్లబ్ లో చేరారు. అదే క్లబ్ సభ్యులైన సర్ R. G. భండార్కర్, గోపాల్ కృష్ణ గోఖలే మరియు జస్టిస్ మహదేవ్ గోవింద్ రనడేతో మంచి పరిచయం ఏర్పడింది.

చదువు పురుటి చేసుకున్న తరవాత ముంబై లోని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పని చేసారు. అక్కడి నంచి ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ లో చేరాలని ఆహ్వానం వచ్చింది.

1903 వ సంవత్సరంలో పూణే దగ్గర ఖడక్వాస్లా జలాశయానికి ఆటోమేటిక్ గేట్ లను ఏర్పాటు చేసారు.

విశ్వేశ్వరయ్య గారి ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావటం తో గ్వాలియర్ లోని టైగర్ డ్యామ్ కు మరియు మైసూర్ లోని కృష్ణ రాజా సాగర్ డ్యామ్ కు ఆటోమేటిక్ గేట్ ల విధానం ఏర్పాటు చేసారు.

అభివృద్ధి పనులు :

1906 వ సంవత్సరంలో భారత దేశ ప్రభుత్వం యెమెన్ దేశంలోని ఏడెన్ నగరానికి నీటి సరఫరా మరియు పారుదల వ్యవస్థల పై అధ్యయనం చేయటానికి పంపించింది. ఏడెన్ నగరంలో ఉన్న సమయంలో విశ్వేశ్వరయ్య ద్వారా తయారు చేయబడిన ప్రాజెక్ట్ విజయవతంతం అయ్యింది.

ఏడెన్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన తరవాత నిజాం పాలిస్తున్న హైదరాబాద్ నగరంలో వరదల బారినుంచి కాపాడటానికి ఒక మంచి ప్రణాళిక మరియు వ్యవస్థ ను రూపొందించారు.

విశ్వేశ్వరయ్య ద్వారా పనిచేస్తున్న అన్ని ప్రాజెక్టులు విజయవంతం కావటం వల్ల అతి తక్కువ కాలంలో ఒక సెలబ్రిటీ గా అయ్యారు.

విశాఖపట్నం లో కూడా sea erosion (సముద్రపు కోత) నుంచి కాపాడటానికి నిర్మించిన రక్షణా వ్యవస్థ లో కీలక పాత్ర వహించారు.

కావేరీ నది పై నిర్మించిన కృష్ణరాజసాగర్ డ్యామ్ మొత్తం కూడా అయన పర్యవేక్షణలో నిర్మించబడింది. ఆ రోజుల్లో ఈ డ్యామ్ ఆసియా లోనే అతిపెద్ద డ్యామ్.

మైసూర్ ప్రభుత్వం వద్ద పనిచేస్తున్న సమయంలో కొన్ని ముఖ్య సంస్థల ఏర్పాటులో కీలక పాత్ర వహించాడు.

మైసూర్ సోప్ ఫ్యాక్టరీ, పారాసిటాయిడ్ లాబొరేటరీ, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్, శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్, బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, సెంచురీ క్లబ్, మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, అపెక్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. లాంటి ముఖ్యమైన సంస్థల ఏర్పాటు చేసారు.

తానూ చేసిన కృషికి గాను కర్ణాటక పీతామహుడు (Father of Modern Mysore State) అని అంటారు.

తిరుమల మరియు తిరుపతి మధ్య రోడ్ నిర్మాణ పనులలో కూడా కీలక పాత్రను వహించారు.

కర్ణాటక లో మాట్లాడే బాషా కన్నడ పై చాలా ప్రేమ ఉండేది. కన్నడ బాషా అభివృద్ధి కోసం కన్నడ పరిషత్ ను కూడా స్థాపించారు.

మైసూర్ దివాన్ :

1908 వ సంవత్సరంలో స్వచ్ఛదంగా రిటైర్మెంట్ తీసుకొని పారిశ్రామిక దేశాల అధ్యయనం చేయటానికి ప్రయాణం చేసేవారు.

తరవాత నిజం ప్రభుత్వం లో హైదరాబాద్ లో పనిచేసారు. మూసి నది వల్ల కలిగే వరద ప్రమాదాన్ని నివారించే వ్యవస్థను ఏర్పాటు చేసారు.

1912 వ సంవత్సరంలో మైసూర్ యొక్క దివాన్ గా 7 సంవత్సరాలు పనిచేసారు.

కృష్ణరాజ వడయార్ IV రాజు నేతృత్వంలో మైసూర్ యొక్క అభివృద్ధి పనులను చేపట్టారు.

1917 వ సంవత్సరంలో బెంగళూరు లో మొట్ట మొదటి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించారు. తరవాతి కాలంలో విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ యూనివర్సిటీ గా పేరు మార్చారు.

అవార్డులు:

కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది ఇండియన్ ఎంపైర్
నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ – బ్రిటిష్ ప్రభుత్వం
భారతరత్న – 1955

ఇవేకాకుండా భారత దేశంలోని 8 విశ్వవిద్యాలయాలు గౌరవ పూర్వంగా డాక్టరేట్ పట్టాతో సత్కరించాయి.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow