TG LAWCET 2025 Updates : తెలంగాణ లాసెట్ 2025 అప్డేట్స్ - ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం, ప్రాసెస్ ఇలా...

P Madhav Kumar


TG LAWCET Applications 2025 : తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 14వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆలస్య రుసుంతో మే 25వ తేదీ వరకు గడువు ఉంది. జూన్ 6వ తేదీన ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తారు.

తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తులు
తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తులు

తెలంగాణ లాసెట్ షెడ్యూల్ - 2025 విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు...ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 15, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 4 వేల ఆలస్య రుసుంతో మే 25వ తేదీ వరకు గడువు ఉందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ లాసెట్ - 2025 ఎంట్రెన్స్ ద్వారా మూడేళ్ల లా, ఐదేళ్ల లా కోర్సులతో పాటు పీజీ కోర్సుల్లోనూ ప్రవేశాలను కల్పిస్తారు. 2025-26 విద్యాసంవత్సరానికి ఈ అడ్మిషన్లు ఉంటాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి తరపున ఉస్మానియా యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది. గతేడాది కూడా ఓయూనే నిర్వహించింది.

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాలకు డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు.

దరఖాస్తు విధానం ఇలా...

  1. లాసెట్ దరఖాస్తు అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించ్ ఆన్ లైన్ అప్లికేషన్ పై క్లిక్ చేయాలి.
  3. ముందుగా నిర్ణయించిన ఫీజును చెల్లించాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
  4. అప్లికేషన్ ఫామ్ లో మీ వివరాలను నమోదు చేయాలి. ఫొటోతో పాటు సంతకాన్ని అప్ లోడ్ చేయాలి.
  5. చివరగా సబ్మిట్ నొక్కితే ప్రాసెస్ పూర్తవుతుంది.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

తెలంగాణ లాసెట్ 2025 - ముఖ్య వివరాలు:

  • ప్రవేశ ప్రకటన - తెలంగాణ లాసెట్ 2025
  • ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - 15 ఏప్రిల్ 2025
  • దరఖాస్తు ఫీజు - జనరల్ అభ్యర్థులు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900 చెల్లించాలి.
  • ఏప్రిల్ 25 వరకు రూ.500 జరిమానా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు.
  • మే 5 వరకు రూ. 1,000 ఆలస్యం రుసం, మే 15 వరకు రూ.2,000, మే 25 వరకు రూ.4,000 ఆలస్య రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ - మే 20, 2025 - మే 25, 2025
  • హాల్ టికెట్లు - 30 మే 2025
  • ప్రవేశ పరీక్ష తేదీ - 6 జూన్ 2025 ( ఉదయం సమయంలో మూడేళ్ల కోర్సుల ప్రవేశ పరీక్ష, మద్యాహ్నం ఐదేళ్ల కోర్సు, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎగ్జామ్ ఉటుంది).
Tags
f