TG EAPCET Registration 2025 : తెలంగాణ ఈఏపీసెట్ ఆన్ లైన్ దరఖాస్తులు ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. స్థానికత విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలగిపోవటంతో… రిజిస్ట్రేషన్లు షురూ కానున్నాయి. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ - 2025కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. గత నెల 25 నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావాల్సినప్పటికీ… స్థానికత విషయంలో సందిగ్ధత ఉండటంతో అధికారులు వాయిదా వేశారు.
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం స్థానికతపై సవరణ మార్గదర్శకాలను జారీ చేసింది. 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకే దక్కుతాయని స్పష్టం చేసింది. దీంతో ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలోనే… అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇవాళ ఉదయం 10.30 గంటల తర్వాత నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
ముఖ్య వివరాలు…!
- ఈఏపీసెట్ ఎంట్రెన్స్ కోసం అభ్యర్థులు మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా కొనసాగుతుంది.
- ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు.
- ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 24 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఏప్రిల్ 9 వరకు రూ. 250 ఆలస్య రుసుము, ఏప్రిల్ 14 వరకు రూ. 500 ఆలస్య రుసుము నిర్ణయించారు.
- ఏప్రిల్ 18 వరకు రూ. 2500 ఆలస్య రుసుము, ఏప్రిల్ 24 వరకు రూ. 5 వేల ఆలస్య రుసుము చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు.
- ఈఏపీసెట్ హాల్ టికెట్లు ఏప్రిల్ 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. జేఎన్టీయూ హైదరాబాద్ వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి.
- మే 2,3,4,5 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలను నిర్వహించారు. కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నారు.
- ఫలితాలను ప్రకటించిన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తారు.
టీజీ ఈఏపీసెట్ 2025 దరఖాస్తు ఎలా…?
- తెలంగాణ ఈఏపీసెట్ - 2025కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- నిర్ణయించిన అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత.. అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
- అప్లికేషన్ పూర్తి చేయటంతో పాటు ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కితే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.