
(1 / 6)
రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించిన తెలంగాణ పీజీఈసెట్-2025 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు వారి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

(2 / 6)
ఈ ఏడాది జరిగిన ఎంట్రెన్స్ పరీక్షలో మొత్తం 21,290 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

(3 / 6)
పరీక్ష రాసిన విద్యార్థులు https://pgecet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే రిజల్స్ లింక్ పై క్లిక్ చేయాలి.

(4 / 6)
ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మీ ఫలితం డిస్ ప్లే అవుతుంది.

(5 / 6)
ర్యాంక్ కార్డు కోసం https://pgecet.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. హోం పేజీలో కనిపించే డౌన్లోడ్ ర్యాంక్ కార్డు లింక్ పై క్లిక్ చేయాలి. హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.

(6 / 6)
సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు. అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం.