46,000 పోస్టులు.. రూ.23 లక్షల ప్యాకేజ్: Agnipath Recruitment 2026

46,000 పోస్టులు.. రూ.23 లక్షల ప్యాకేజ్: Agnipath Recruitment 2026

P Madhav Kumar


దేశ రక్షణ దళాల్లో సేవ చేయాలనే తపన ఉన్న యువతకు ఇదో అరుదైన అవకాశం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "అగ్నిపథ్" కింద ఈ ఏడాది సుమారు 46,000 అగ్నివీర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. కేవలం ఉద్యోగం మాత్రమే కాదు... క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ఆర్థిక భద్రత, భవిష్యత్‌లో విస్తృత అవకాశాలు.. ఈ నాలుగింటినీ కలిపిన సమగ్ర పథకం ఇదే. 8వ తరగతి, 10వ తరగతి, 12వ తరగతి అర్హత కలిగిన యువత దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 17 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. దేశవ్యాప్తంగా నియామకాలు జరుగుతాయి.





Agnipath నియామకాలు ఎక్కడ?

అగ్నివీర్‌లను త్రివిధ దళాల్లో నియమించనున్నారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లలో ఉద్యోగాల కేటాయింపు ఉంటుంది.ఎంపిక విధానం విషయానికి వస్తే ముందుగా ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. అది పాసైన వారికి మెడికల్ పరీక్ష ఉటుంది. ఈ రెండింటిలో అర్హత సాధించిన వారిని.. చివరిగా రాత పరీక్ష (సంబంధిత దళం ప్రకారం) కు ఎంపిక చేసి.. అక్కడ ఫైనల్ చేస్తారు.

దరఖాస్తు విధానం: పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి

వెబ్‌సైట్లు:

Army - www.joinindianarmy.nic.in

Navy - www.joinindiannavy.gov.in

Air Force - https://agnipathvayu.cdac.in

పథకం వివరాలు కోసం https://agneepathscheme.in/ మీద క్లిక్ చేసి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు

నాలుగేళ్లలో రూ.23 లక్షలకు పైగా లాభం..

అగ్నివీర్‌గా నియమితులైన వారికి నాలుగేళ్ల కాలానికి జీతం, సేవనిధి కలిపి గణనీయమైన ఆర్థిక లాభం లభిస్తుంది.




1వ సంవత్సరం: ₹21,000 × 12 = ₹2,52,000

2వ సంవత్సరం: ₹23,100 × 12 = ₹2,77,200

3వ సంవత్సరం: ₹25,580 × 12 = ₹3,06,960

4వ సంవత్సరం: ₹28,000 × 12 = ₹3,36,000

నాలుగేళ్ల మొత్తం జీతం రూ. 11,72,160 లభస్తుంది. సేవనిధి (4వ సంవత్సరం ముగిసినప్పుడు) సుమారు రూ. 11,71,000 అందుతుంది. అంటే మొత్తం లాభం సుమారు రూ. 23,43,160 వరకు చేతికి అదుతుంది. ఇది యువతకు ఆర్థికంగా బలమైన ప్రారంభం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

సేవా కాలంలో లభించే ప్రయోజనాలు..

అత్యుత్తమ సైనిక శిక్షణ

ఆర్మీ రెజిమెంటల్ జీవనం (ఆహారం, దుస్తులు, వసతి)

క్రమశిక్షణతో కూడిన జీవనశైలి

నాయకత్వ లక్షణాల పెంపు

అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం

అయితే సర్వీసు పూర్తైన తర్వాత మా పరిస్థితి ఏంటని సందేహ పడేవారున్నారు. నాలుగేళ్ల సేవా కాలం పూర్తైన తర్వాత మీ ప్రతిభ ఆధారంగా త్రివిధ దళాలతో పాటు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలలో పని చేసే అవకాశం కల్పిస్తారు. అలాగే దేశ భద్రతలో కీలక పాత్ర పోషించే

అలాగే డీఆర్డీవో (DRDO) ఆధ్వర్యంలోని పలు ల్యాబ్స్, పరిశోధనా యూనిట్లలో కూడా అవకాశాలు ఉన్నాయి.

10% రిజర్వేషన్

కోస్ట్ గార్డ్స్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులు, దాదాపు 100కు పైగా డిఫెన్స్ PSUలు, డిఫెన్స్ R&D యూనిట్లలో అగ్నివీరులకు 10% కోటా కల్పించనున్నట్లు వెల్లడించారు.




యువతకు పిలుపు

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది సాధారణ నియామకం కాదు.. జీవితాన్ని మలిచే అవకాశం. నాలుగేళ్ల సేవ తర్వాత ఆర్థికంగా బలంగా నిలబడటమే కాకుండా, ప్రభుత్వ, భద్రతా, కార్పొరేట్ రంగాల్లో విస్తృత అవకాశాలు లభించే అవకాశం ఉంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లలో పూర్తి వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేయాలని సూచిస్తున్నారు. దేశసేవతో ప్రారంభమయ్యే ఈ ప్రయాణం... భవిష్యత్తుకు బలమైన పునాది కావచ్చు
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow