ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్, ITBP కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు ITBP అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా 819 పోస్టులను భర్తీ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 2న ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1, 2024న ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలను తెలుసుకుందాం..
మెుత్తం ఖాళీ వివరాలు
పురుషులు: 697 పోస్ట్‌లు, స్త్రీ: 122 పోస్ట్‌లు
అర్హత ప్రమాణాలు
పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయోపరిమితి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియలో ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME)/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ (RME) ఉంటాయి. దరఖాస్తు రుసుము రూ. 100గా నిర్ణయించారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళలు, మాజీ సైనికులు, అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.