JNAFAU: జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ నోటీఫికేషన్

JNAFAU: జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ నోటీఫికేషన్

P Madhav Kumar


JNAFAU: జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ నోటీఫికేషన్ విడులైంది. వచ్చే నెల 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ అధికారులు వెల్లడించారు. లేట్ ఫీజుతో వచ్చే నెల 26 వరకు అవకాశం ఉంది.

జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ పీహెచ్‌డీ నోటీఫికేషన్
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ పీహెచ్‌డీ నోటీఫికేషన్

జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ నోటీఫికేషన్ విడుదల అయ్యింది. పార్ట్ టైం, ఫుల్ టైం పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్‌కు నోటీఫికేషన్ విడుదల చేశారు. ఆర్కిటెక్చర్, పెయింటింగ్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ విభాగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్టు వర్సిటీ అధికారులు వెల్లడించారు. ఈ విభాగాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు స్పష్టం చేశారు.

అధికారిక వెబ్‌సైట్ నుంచి..

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి అప్లికేషన్ ఫామ్, ఇతర వివరాలను www.jnafau.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు వివరించారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. ఫామ్ ఫిల్ చేసి.. సర్టిఫికేట్ల జిరాక్స్ జతచేసి సమర్పించాలని సూచించారు.

ఫిజు వివరాలు..

దరఖాస్తు ఫీజు రూ.2 వేలుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. వెయ్యి అని వెల్లడించారు. అభ్యర్థులు తమ ఫీజును డీడీ రూపంలో చెల్లించాలని అధికారులు వివరించారు. సెప్టెంబర్ 19 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం ఉందని చెప్పారు. లేట్ ఫీజు రూ.వెయ్యిగా నిర్ణయించారు. లేట్ ఫీజుతో అయితే.. సెప్టెంబర్ 26 సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని వర్సిటీ అధికారులు వెల్లడించారు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow