TG LAWCET Updates 2024 : తెలంగాణ 'లాసెట్' కౌన్సెలింగ్ - ప్రారంభమైన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, 27న సీట్ల కేటాయింపు

TG LAWCET Updates 2024 : తెలంగాణ 'లాసెట్' కౌన్సెలింగ్ - ప్రారంభమైన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, 27న సీట్ల కేటాయింపు

P Madhav Kumar

TS LAWCET Counselling 2024 : తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది.

తెలంగాణ లాసెట్ ప్రవేశాలు 2024
తెలంగాణ లాసెట్ ప్రవేశాలు 2024

TS LAWCET Counselling 2024 : తెలంగాణలోని న్యాయ కళాశాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఆగస్టు 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. https://lawcet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం రూ. 800 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు మాత్రం రూ. 500 పేమెంట్ చేయాలి. ఆగస్టు 22వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 23వ తేదీతో ఈ గడువు పూర్తి అవుతుంది. ఆగస్టు 24వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఆగస్టు 27వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 28 నుంచి 30 తేదీల మధ్య సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఈ ఏడాది జరిగిన తెలంగాణ లాసెట్ పరీక్షకు 40,268 మంది హాజరయ్యారు. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు. మొత్తంగా 72.66 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి...

  • లాసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు మొదటగా https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
  • -గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
  • అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.

2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహించింది. ఈ ఏడాదికి సంబంధించి జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలను నిర్వహించారు. ఉద‌యం 9 నుంచి 10.30 వ‌ర‌కు మొదటి సెషన్ జరిగింది. ఇక మ‌ధ్యాహ్నం 12.30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్, సాయంత్రం 4 నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు మూడో సెషన్ పరీక్షను నిర్వహించారు. గతేడాదితో పోల్చితే ఈసారి లాసెట్ కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.

https://lawcetadm.tsche.ac.in/nocv24/index.aspx

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow