Vizianagaram CTU Admissions : విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ (సీటీయూ)లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సులకు నోటీఫికేషన్ విడుదల అయింది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను దాఖలు చేసేందుకు ఆగస్టు 16 తేదీ వరకు గడువు ఇచ్చారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించిన అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ పరీక్ష) రాసిన అభ్యర్థులు దరఖాస్తులకు అర్హులు. సీయూఈటీ యూజీ-2024 స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని దరఖాస్తు దాఖలు చేసినప్పుడు జతచేయాలి. అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://ctuapcuet.samarth.edu.in/ ద్వారా దరఖాస్తును చేసుకోవాలి. ఆగస్టు 16 తేదీ రాత్రి 11.55 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు కేటగిరీ అభ్యర్థులకు రూ.100 ఉంటుంది. అదనపు సమాచారం కోసం యూనివర్సిటీ ఏర్పాటు చేసిన హెల్ప్ సెంటర్ ఫోన్ నంబర్‌కు 0892296033కు పని వేళల్లో (ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) సంప్రదించవచ్చని సీటీయూ వైస్ ఛాన్సలర్ తేజస్వి కట్టీమని తెలిపారు.
కోర్సులు
- బీఎస్సీ కెమిస్ట్రీ (హానర్స్ రీసెర్చ్/ హానర్స్)
- బీఎస్సీ బొటనీ (హానర్స్ రీసెర్చ్/ హానర్స్)
- బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (హానర్స్ రీసెర్చ్/ హానర్స్)
- బీఎస్సీ జియాలజీ (హానర్స్ రీసెర్చ్/ హానర్స్)
- బీబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ (హానర్స్ రీసెర్చ్/ హానర్స్)
- బీకాం ఒకేషనల్
అడ్మిషన్ షెడ్యూల్
- అప్లికేషన్ దాఖలు ఆఖరు తేదీ -ఆగస్టు 16
- మెరిట్ లిస్టు ప్రకటన- ఆగస్టు 19
- యూజీ అడ్మిషన్ కౌన్సిలింగ్ -ఆగస్టు 26
- తరగతులు ప్రారంభం - సెప్టెంబర్ 9
జగదీశ్వరావు జరజాపు , హిందుస్తాన్ టైమ్స్ తెలుగు