వందే మాతర గీతం వరస మారుతున్నది సాంగ్ లిరిక్స్ - దేశభక్తి గేయాలు

వందే మాతర గీతం వరస మారుతున్నది సాంగ్ లిరిక్స్ - దేశభక్తి గేయాలు

P Madhav Kumar

 Album:Vandemataram


Starring:Rajashekar, Vijayashanthi
Music:Chakravarthy
Lyrics- C. Narayana Reddy
Singers :Srinivas
Producer:Babu Rao Pokuri
Director:T.Krishna
Year: 1985


వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందే మాతరం
వందే మాతర గీతం వరస మారుతున్నది
వందే మాతర గీతం వరస మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో
సుజల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో
జలం లేక బలం లేక జనం ఎండుతున్నది
మలయజ శీతల పదకోమల భావన బాగున్నా
కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది
మంట రగులుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
వందే మాతరం వందే మాతరం
సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో
సస్యశ్యామల విభవస్తవ గీతాలాపనలో
పైరు నోచుకోని బీళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి
సుప్రజ్యోత్స్నా పులకిత సురుచిర యామినులలోనా
రంగు రంగు చీకట్ల గిరాకి పెరుగుతున్నది
గిరాకి పెరుగుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
వందే మాతరం వందే మాతరం
పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ
పుల్లకు సుమిత ధ్రుమదళ వల్లికామ తల్లి కలకూ
చిదిమి వేసినా వదలని చీడ అంటుకున్నది
సుహాస్ర సంపదలకేమి సుమధుర భాషణలకేమీ
ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది
ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నది
ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే వున్నది
అక్కడనే వున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
వందే మాతరం వందే మాతరం
వందే మాతర గీతం వరస మారుతున్నది
వందే మాతర గీతం వరస మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది
తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow