ఒక్కేసి పూవ్వేసి చందమామ
ఒక్క జాములాయె చందమామ
జాముజాముకూ చందమామ
శివుడు రాకాపాయే చందమామ
రెండేసి పూలేసి చందమామ
రెండు జాములాయె చందమామ
జాముజాముకూ చందమామ
శివుడు రాకాపాయే చందమామ
మూడేసి పూలేసి చందమామ
మూడు జాములాయె చందమామ
జాముజాముకూ చందమామ
శివుడు రాకాపాయే చందమామ
నాలుగేసి పూలేసి చందమామ
నాలుగు జాములాయె చందమామ
శివపూజ వేలాయె చందమామ
శివుడు రాకాపాయే చందమామ
ఐదేసి పూలేసి చందమామ
ఐదు జాములాయె చందమామ
శివపూజ వేలాయె చందమామ
శివుడొచ్చి కూర్చునే చందమామ
చందమామ పాట