TG GENCO Results 2024 : తెలంగాణ జెన్‌కో ఉద్యోగ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

TG GENCO Results 2024 : తెలంగాణ జెన్‌కో ఉద్యోగ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

P Madhav Kumar


TG GENCO Results 2024 : తెలంగాణ జెన్‌కో ఉద్యోగాల ఫలితాలు విడుదలయ్యాయి. ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి జులై 14వ తేదీన ఆన్ లైన్ పరీక్ష నిర్వహించగా… శుక్రవారం అధికారులు ఫలితాలను ప్రకటించారు. https://tggenco.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులను ఫలితాలను చెక్ చేసుకోవచ్చని తెలిపారు.

జెన్‌కో ఉద్యోగాల ఫలితాలు
జెన్‌కో ఉద్యోగాల ఫలితాలు

తెలంగాణ జెన్‌కోలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జులై 14వ తేదీన 339 అసిస్టెంట్ ఇంజినీరు(ఏఈ), 60 కెమిస్ట్‌ ఉద్యోగాల భర్తీకి ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహించారు. వీటికి సంబంధించిన ఫలితాలను శుక్రవారం అందుబాటులోకి తీసుకొచ్చారు. https://tggenco.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

జెన్ కో ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • తెలంగాణ జెన్ కో ఉద్యోగ పరీక్షలు రాసిన అభ్యర్థులు https://tggenco.com/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే TG GENCO Results లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీ Register Number, TGGENCO Hallticket No , పుట్టిన తేదీ వివరాలను, మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • వ్యూ రిజల్ట్స్ పై క్లిక్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి ఫలితాల కాపీని పొందవచ్చు.

రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు పాత విద్యుత్ కేంద్రాలలో పనిచేసేందుకు ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు జెన్ కో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నోటిఫికేషన్లను విడుదల చేసి… అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.

మొత్తం 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ పోస్టుల భర్తీకి గత ఏడాది అక్టోబరు 5న నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థుల నుంచి అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు అప్లికేషన్లు స్వీకరించారు. నవంబరు 14, 15 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు. 

గతేడాది డిసెంబర్‌ 17న రాత పరీక్ష నిర్వహిస్తామ‌ని జెన్ కో ప్రక‌టించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు కారణాలతో ఈ పరీక్ష వాయిదా ప‌డింది. అయితే తిరిగి మార్చి 31వ తేదీన పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ ఆ తేదీల్లో కూడా సాధ్యం కాలేదు. మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. జులై 14వ తేదీన కంప్యూటర్‌ బేస్ట్‌ విధానంలో ఈ నియామకాలకు సంబంధించిన రాతపరీక్ష నిర్వహించింది.

మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. 80 మార్కులకు సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడగగా.. మిగతా 20 మార్కులు ఇంగ్లీష్, జనరల్ అవర్ నెస్, తెలంగాణ సంస్కృతితో పాటు పలు అంశాల నుంచి అడిగారు. ఎంపికైన అభ్యర్థులకు జీతం - రూ.65,600 - రూ.1,31,220 (RPS-2022) ఉంటుంది. 

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow