శుక్రవారం లక్ష్మీ ఉయ్యాలో
మా ఇంటికొస్తెను ఉయ్యాలో
పసుపు కుంకుమలతో ఉయ్యాలో
నేనెదురుకుందును ఉయ్యాలో
శనివారం లక్ష్మీ ఉయ్యాలో
మా ఇంటికొస్తెను ఉయ్యాలో
చేమంతిపూలతో ఉయ్యాలో
నేనెదురుకుందును ఉయ్యాలో
ఆదివారం లక్ష్మీ ఉయ్యాలో
మా ఇంటికొస్తెను ఉయ్యాలో
అత్తరు పన్నీరుతో ఉయ్యాలో
నేనెదురుకుందును ఉయ్యాలో
సోమవారం లక్ష్మీ ఉయ్యాలో
మా ఇంటికొస్తెను ఉయ్యాలో
సొమ్ములా పెట్టెలతో ఉయ్యాలో
నేనెదురుకుందును ఉయ్యాలో
మంగళవారం లక్ష్మీ ఉయ్యాలో
మా ఇంటికొస్తెను ఉయ్యాలో
మంగళారతులతో ఉయ్యాలో
నేనెదురుకుందును ఉయ్యాలో
బుధవారం లక్ష్మీ ఉయ్యాలో
మా ఇంటికొస్తెను ఉయ్యాలో
బుక్కగుల్లాలతో ఉయ్యాలో
నేనెదురుకుందును ఉయ్యాలో
గురువారం లక్ష్మీ ఉయ్యాలో
మా ఇంటికొస్తెను ఉయ్యాలో
గుల్లెడు శనగలతో ఉయ్యాలో
నేనెదురుకుందును ఉయ్యాలో
లక్ష్మీ దేవి పాట