AP Inter Results 2025 : నేడు ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు విడుదల - సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోండి

AP Inter Results 2025 : నేడు ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు విడుదల - సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోండి

P Madhav Kumar


AP Intermediate Results 2025 : నేడు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలవుతాయి. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. HT తెలుగు వెబ్ సైట్ తో పాటు ఏపీ ఇంటర్ బోర్డు వెబ్ సైట్, మనమిత్ర వాట్సప్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు - 2025
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు - 2025

ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు రాబోతున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ఫలితాలను ప్రకటించనుంది. పరీక్షలు రాసిన విద్యార్థులు… హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్ సైట్ ద్వారా వేగంగా ఫలితాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఏపీ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ తో పాటు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనమిత్ర వాట్సప్ ద్వారా కూడా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

ఈ ఏడాదికి సంబంధించిన ఏపీ ఇంటర్ పరీక్షలు మార్చి 20వ తేదీతో ముగిశాయి. ఆ వెంటనే బోర్డు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఫలితాలను వేగంగా ప్రకటించడానికి చర్యలు చేపట్టింది. మొత్తం 25 కేంద్రాల్లో మార్చి 17 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కాగా… మొత్తం 4 విడుతల్లో పూర్తి చేశారు. కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా పూర్తి కావటంతో ఇవాళ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

వాట్సాప్ లో ఏపీ ఇంటర్ ఫలితాలు 2025 :

విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు, మార్కుల మెమోలను మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో ఏపీ వాట్సాప్ యాప్‌ నెంబర్ ద్వారా ఫలితాలు పొందవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి…

  • ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు 'Hi' అని మెసేజ్ చేయండి.
  • ఆ తర్వాత 'సెలెక్ట్ సర్వీస్' లో 'విద్యా సేవలు' ఎంచుకోండి.
  • 'డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు- 2025' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మార్కుల మెమో పొందడానికి మీ 'హాల్ టికెట్' నెంబర్‌ను నమోదు చేయండి.
  • పీడీఎఫ్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి.

ఇంటర్ బోర్డు సైట్ లో ఇలా…

  • విద్యార్థులు ఏపీ ఇంటర్ విద్యా మండలి అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే AP IPE ఫలితాలు 2025' అనే లింక్ పై క్లిక్ చేయాలి.
  • తర్వాత ఇంటర్ 1వ సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాలపై క్లిక్ చేయండి. లాగిన్ విండో ఓపెన్ అవుతుంది.
  • లాగిన్ విండోలో విద్యార్థి హాల్ టికెట్ నంబర్ తో పాటు అవసరమైన వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
  • స్క్రీన్ పై ఇంటర్ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • భవిష్యత్ అవసరాల కోసం ఇంటర్ మార్క్ షీట్ డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.

ఇక ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకునే వీలు ఉంది. మీ ఫోన్ లో SMS తెరిచి APGEN2 లేదా APGEN1 (స్పేస్) రోల్ నెంబర్‌ను టైప్ చేయాలి. ఆ తర్వాత 5626 కు మెసేజ్ పంపాలి. మీ ఇంటర్ ఫలితాలను మెసేజ్ గా అందుకుంటారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow