Lyrics in Telugu:
తల్లీ భారతి వందనం
నీ ఇల్లే మా నందనం
మేమంతా నీ పిల్లలము
నీ చల్లని ఒడిలో మల్లెలము
తల్లిదండ్రులను గురువులను
ఎల్లవేళలా కొలిచెదమమ్మా
చదువులు బాగా చదివెదమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా
కుల మత భేదం మరచెదము
కలతలు మాని మెలగెదము
మానవులంతా సమానులంటూ
మమతను సమతను పెంచెదము
తెలుగు జాతికీ అభ్యుదయం
నవ భారతికే నవోదయం
భావి పౌరులం మనందరం
భారత జనులకు జయం జయం
Lyrics in English:
Talli Bhaarati Vandanam
Ni Ille Maa Nandanam
Meemantaa Ni Pillalamu
Ni Challani Odilo Mallelamu
Tallidandrulanu Guruvulanu
Ellavelalaa Kolichedamammaa
Chaduvulu Baagaa Chadivedamammaa
Jaati Gouravam Penchedamammaa
Kula Mata Bheedam Marachedamu
Kalatalu Maani Melagedamu
Maanavulantaa Samaanulantu
Mamatanu Samatanu Penchedamu
Telugu Jaatiki Abhyudayam
Nava Bhaaratike Navodayam
Bhaavi Pourulam Manandaram
Bhaarata Janulaku Jayam Jayam