Lyrics in Telugu:
స్వతంత్ర భారత జనని నీకిదె నితాంత నవ నీరాజనము (2)
అశేష పూజా శిరీషములతో అగణిత నర నారీ జనము (2)
స్వతంత్ర భారత జనని నీకిదె నితాంత నవ నీరాజనము
వదలెను చిర దాస్య శృంఖలమ్ములు చెదరెను దైన్యతమ వటనమ్ములు (2)
ఆ సేతు హిమనగమ్ముగ పొంగి అలముకొన్నదానన్ద తరంగము (2)
స్వతంత్ర భారత జనని నీకిదె నితాంత నవ నీరాజనము
త్యాగమూర్తియౌ మహాత్ముడొసగిన శాంత్యహింసలె సదాశయములుగ (2)
సకల వసుంధరనేకము సేయగ అకళంకులమై ప్రతినలు సేతుము (2)
స్వతంత్ర భారత జనని నీకిదె నితాంత నవ నీరాజనము
అశేష పూజా శిరీషములతో అగణిత నర నారీ జనము
స్వతంత్ర భారత జనని నీకిదె నితాంత నవ నీరాజనము
Lyrics in English:
Swatantra Bhaarata Janani Nikide Nitaanta Nava Nirajanamu
Asesha Pooja Sireshamulato Aganita Nara Naari Janamu

Vadalenu Chira Daasya Srunkhalammulu Chedarenu Dainyatama Vatanammulu
Aasetu Himanagammuga Pongi Alamukonnadaananda Tarangamu
Swatantra Bhaarata Janani Nikide Nitaanta Nava Nirajanamu
Tyagamurthiyou Mahatmudosagina Saantyahimsale Sadaasayamuluga
Sakala Vasundharanekamu Seyaga Akalankulamai Pratinalu Setumu
Swatantra Bhaarata Janani Nikide Nitaanta Nava Nirajanamu
Asesha Pooja Sireshamulato Aganita Nara Naari Janamu
Swatantra Bhaarata Janani Nikide Nitaanta Nava Nirajanamu
స్వతంత్ర భారత జనని - దేశభక్తి గేయాలు
Friday, September 20, 2024
Tags