TG ICET Counselling 2024 Updates : టీజీ ఐసెట్ - 2024 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 21వ తేదీన ఆన్ లైన్ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 25వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. https://tgicet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
తెలంగాణ ఐసెట్ - 2024 ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తికాగా… ఇవాళ్టి (సెప్టెంబర్ 20) నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇవాళ ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 20, 21 తేదీల్లో ఆన్ లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేస్తారు.
ధువపత్రాల వెరిఫికేషన్ పూర్తి అయిన అభ్యర్థులు 21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. 22వ తేదీన ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 25వ తేదీలోపు సీట్లను కేటాయిస్తామని అధికారులు ప్రకటించారు. సెప్టెంబర్ 25, 27 తేదీల్లో నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 25 నుంచి 28 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. సెప్టెంబర్ 27వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలవుతాయి. https://tgicet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వెబ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు కింద ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 600, మిగతా వారు రూ. 1200 చెల్లించాలి.
ఐసెట్ ప్రవేశాలకు పుల్ డిమాండ్…!
ఇటీవలే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఎంసీఏ కోర్సుల్లో 86 శాతం, ఎంబీఏలో 87.5 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది మొత్తం 34,748 సీట్లు ఉండగా… 30,300 సీట్లు ఫస్ట్ ఫేజ్ లోనే భర్తీ అయ్యాయి. ఇంకా 4,448 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. తొలి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు రిపోర్టింగ్ చేసే గడువు కూడా సెప్టెంబర్ 17వ తేదీతో పూర్తి అయింది. ఈ ఏడాది ఐసెట్ ప్రవేశాలకు బాగా డిమాండ్ పెరిగిందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
ఇక ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ లో కూడా సీట్ల కోసం అభ్యర్థులు భారీగానే పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. మొదటి విడతలోనే దాదాపు 80 శాతానికి పైగా సీట్లు భర్తీ కావటంతో… ఫైనల్ ఫేజ్ లో తక్కువ సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ విడత కూడా పూర్తి అయితే…. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ ఐసెట్ పరీక్ష కోసం 86156 మంది దరఖాస్తు చేసుకున్నారు. 77942 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 71 వేల 647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది.జూన్ 5, 6 తేదీల్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఐసెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.
టీజీ ఐసెట్ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే ICET Results 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు Registration Number, పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.