TG TET DSC Updates : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్ - టెట్ వివరాల 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది..! ఇదిగో డైరెక్ట్ లింక్

TG TET DSC Updates : డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్ - టెట్ వివరాల 'ఎడిట్ ఆప్షన్' వచ్చేసింది..! ఇదిగో డైరెక్ట్ లింక్

P Madhav Kumar


TG DSC TET Edit Option : తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. టెట్ వివరాల ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులో తీసుకొచ్చింది. విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ ( https://schooledu.telangana.gov.in/ISMS/ )లోకి వెళ్లి ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 13తో ఈ గడువు పూర్తి అవుతుంది.

తెలంగాణ డీఎస్సీ, టెట్  -2024
తెలంగాణ డీఎస్సీ, టెట్ -2024

టెట్ వివరాల సవరణ కోసం తెలంగాణ విద్యాశాఖ ఎడిట్ ఆప్షన్ తీసుకొచ్చింది. గురువారం సాయంత్రం తర్వాత  ఈ ఆప్షన్ ను అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా టెట్ పరీక్ష మార్కులు, హాల్‌టికెట్, ఇతర పలు వివరాల నమోదులో దొర్లిన తప్పులను సవరించుకునే అవకాశం ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను ఎడిట్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.

ఇవాళ, రేపు(సెప్టెంబర్ 12, 13) మాత్రమే ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉండనుంది. సెప్టెంబర్ 13వ తేదీ తర్వాత టెట్ వివరాల్లో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులు కలిపి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇటీవల డీఎస్సీ ఫైనల్ కీ విడుదల చేశారు. త్వరలోనే డీఎస్సీ ఫలితాలు విడుదల కానున్నాయి.

ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ ఫలితాలను జూన్‌ 12వ తేదీన విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్ ఫలితాల్లో పేపర్‌-1లో 57,725 మంది, పేపర్‌-2లో 51,443 మంది క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత డీఎస్సీ పరీక్షలను నిర్వహించారు. ఆ తర్వాత ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించారు. వాటిని విశ్లేషించిన తర్వాత… ఇటీవలే ఫైనల్ కీలను ప్రకటించారు.

ఫైనల్ కీలను ప్రకటించిన నేపథ్యంలో త్వరలోనే డీఎస్సీ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. అయితే చాలా మంది అభ్యర్థులు టెట్‌ వివరాల తప్పులను సవరించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయానికి తరలివెళ్లారు. వాటిని సవరించకుండా డీఎస్సీ జనరల్‌ ర్యాంకు లిస్ట్‌(జీఆర్‌ఎల్‌) ఇస్తే సమస్యలు ఎదురవుతాయని విద్యాశాఖ భావించింది. ఈ క్రమంలోనే టెట్ వివరాల ఎడిట్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

డీఎస్సీలో టెట్ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. టెట్ మార్కులను కలిపి డీఎస్సీ జనరల్‌ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో టెట్ వివరాల ఎడిట్ కు పాఠశాఖ విద్యాశాఖ అవకాశం కల్పించింది.

టెట్ వివరాలను ఇలా ఎడిట్ చేసుకోండి:

  • డీఎస్సీ అభ్యర్థులు https://schooledu.telangana.gov.in/ISMS/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే Direct Recruitment of TG DSC - 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ కొత్త విండో ఓపెన్ అవుతుంది. హోం పేజీలో Edit TET Details అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ అభ్యర్థి Registration Numberతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి క్లిక్ చేయాలి.
  • మీ టెట్ వివరాలను డిస్ ప్లే అవుతాయి. ఎక్కడైనా తప్పులు ఉంటే సవరించుకోవచ్చు. ఆ తర్వాత తిరిగి సబ్మిట్ చేయాలి.

ఇక తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా చూస్తే…. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow