Postal GDS Recruitment : ఇండియా పోస్టులో 21,413 గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలో 1215, తెలంగాణలో 519 ఖాళీలున్నాయి. పదో తరగతి అర్హత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పదోతరగతి అర్హతతో పోస్టల్ శాఖలో 21,413 జీడీఎస్ ఉద్యోగాలు- ఏపీ, తెలంగాణలో ఎన్ని ఖాళీలంటే?
Postal GDS Recruitment : ఇండియా పోస్టులో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 21,413 గ్రామీణ్ డాక్ సేవక్(జీడీఎస్) పోస్టుల భర్తీ చేయనున్నారు. ఏపీలో 1215, తెలంగాణలో 519 ఖాళీలున్నాయి. పదో తరగతి అర్హత, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం ఉండాలి.
పదో తరగతి పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 3 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రామీణ్ డాక్ సేవక్ కింద బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవకులను నియమించనున్నారు.
దరఖాస్తు రుసుము
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు : రూ. 100
- SC/ST/PWD/మహిళా అభ్యర్థులు/ట్రాన్స్ ఉమెన్ - ఫీజు లేదు
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 10-02-2025
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 03-03-2025
- కరెక్షన్ విండో : 06.03.2025 నుంచి 08.03.2025
వయో పరిమితి
- కనీస వయో పరిమితి: 18 సంవత్సరాలు
- గరిష్ట వయోపరిమితి: 40 సంవత్సరాలు
- నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
అర్హత
- అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.