TG ICET Notification 2025 Updates : తెలంగాణ ఐసెట్-2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 10వ తేదీతో ప్రారంభమవుతుంది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మే 3వరకు అప్లయ్ చేసుకోవచ్చు. జూన్ 8,9 తేదీల్లో పరీక్షలు ఉంటాయి.
తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే టీజీఐసెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మహాత్మగాంధీ యూనివర్శిటీ అధికారులు వివరాలను ప్రకటించారు. మార్చి 10వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. మే 3 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా అప్లికేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
నోటిఫికేషన్ వివరాల ప్రకారం… రూ 250 రూపాయలు అపరాధ రుసుంతో మే 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ 500 రూపాయల అపరాధ రుసుముతో మే 26 వరకు అవకాశం కల్పించారు. మే 16 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. జూన్ 8,9 తేదీల్లో పరీక్షలను నిర్వహిస్తారు. సీబీటీ విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయి.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 :30 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మధ్యాహ్నం సెషన్ ఉంటుంది. ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి జూన్ 21న పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేస్తారు. జూన్ 22 నుంచి 26 వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జులై 7న ఫలితాలను ప్రకటిస్తారు.