TG EdCET 2025 Applications : టీజీ ఎడ్ సెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నేటి నుంచి ఆన్ లైన్ ద్వారా ప్రాసెస్ చేసుకోవచ్చు. మే 13వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. జూన్ 1వ తేదీన ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది.
తెలంగాణలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు నిర్ణయించిన ఫీజును చెల్లించి… అప్లికేషన్ చేసుకోవచ్చు. జూన్ 1వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది.
టీజీ ఎడ్ సెట్ ద్వారా 2025 - 2026 విద్యా సంవత్సరానికి గాను బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మే 13వ తేదీతో ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది. రూ. 500 ఫైన్ తో మే 24 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ. 750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 550 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
జూన్ 1వ తేదీన ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుంది. ఉదయం సెషన్ ఉదయం 10 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుంది. ఈ ఏడాదికి సంబంధించి ఉన్నత విద్యామండలి తరపున కాకతీయ యూనివర్శిటీ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది.
- ముందుగా నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
- ఆ తర్వాత హోం పేజీలో కనిపించే Fill Application Form పై క్లిక్ చేయాలి. ఇక్కడ పేమెట్ ఐడీ, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి.
- ఆ తర్వాత దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ప్రాసెస్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.
ముఖ్య తేదీలు:
- ప్రవేశ పరీక్ష ప్రకటన - టీజీ ఎడ్ సెట్
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - 13 మే 2025
- రూ. 500 ఫైన్ తో చివరి తేదీ - 25 మే 2025
- ఎడిట్ ఆప్షన్ - 25 మే 2025
- హాల్ టికెట్లు డౌన్లోడ్ - 29 మే 2025
- పరీక్ష తేదీలు - 1 జూన్, 2025.
- ప్రిలిమినరీ కీ విడుదల - 5 జూన్ 2025
- ఫైనల్ కీ, తుది ఫలితాలు - 21 జూన్ 2025.