TGPSC Group 3 Results : తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు (జనరల్ ర్యాంకింగ్ లిస్ట్) విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ధ్రవపత్రాల పరిశీలన తర్వాత నియామకపత్రాలను అందిస్తారు.

తెలంగాణ గ్రూప్స్ పరీక్షలు ఫలితాలు ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్ 1, 2 ఫలితాలు రాగా… ఇవాళ గ్రూప్ 3 ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి. ముందుగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు . ఆ తర్వాత నియామక జాబితాను ప్రకటిస్తారు.
రాష్ట్రంలో 1365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు 50.24శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఈ ప్రక్రియంతా పూర్తి కావటంతో… ఇవాళ ఫలితాలను(జనరల్ ర్యాంకింగ్ లిస్ట్) ప్రకటించారు.
గ్రూప్ 3 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..?
- గ్రూప్ 3 అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే గ్రూప్ 3 సర్వీస్ జనరల్ ర్యాకింగ్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే.. పీడీఎఫ్ ఫార్మాట్ వివరాలు ఓపెన్ అవుతాయి.
- ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు స్కోర్ వివరాలు కనిపిస్తాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కాపీని పొందవచ్చు.
- వీటికి సంబంధించి ఏ సమస్య ఉంటే టీజీపీఎస్సీని సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.
తెలంగాణ గ్రూప్ 3 పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,36,477 మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్ 3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహించారు. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు.
గ్రూప్ 3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. జనరల్ ర్యాంకంగ్ జాబితా విడుదల తర్వాత… ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తారు. ఆ తర్వాత…. మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. ఇందులో పేరున్న వారికి నియామక పత్రాలను అందజేస్తారు.