Telangana Model Schools Admission Updates : తెలంగాణలోని ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నాయి. అయితే ఈ గడువును మార్చి 10 నుంచి 20వ తేదీ వరకు పొడిగించారు. ఇక పరీక్షను ఏప్రిల్ 13న కాకుండా… 20వ తేదీకి వాయిదా వేశారు.

తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఆన్ లైన్ దరఖాస్తుల గడువును పొడిగించటంతో పాటు ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీని మార్చారు. ఈ మేరకు వివరాలను ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. ఏప్రిల్ 13వ తేదీన ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ ఈ తేదీని ఏప్రిల్ 20కి వాయిదా వేశారు.
దరఖాస్తుల గడువు పొడిగింపు…
ఈ నోటిఫికేషన్ ద్వారా 2025 - 2026 విద్యా సంవత్సరానికి ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు… 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 7-10 తరగతుల్లోని ఖాళీ సీట్లను కూడా భర్తీ చేస్తారు. ఇప్పటికే విద్యార్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మార్చి 10వ తేదీతో పూర్తి కానుంది. అయితే దరఖాస్తుల గడువును మార్చి 20వ తేదీ వరకు పొడిగించారు.
దరఖాస్తు రుసుం కింద ఓసీ విద్యార్థులు రూ. 200 చెల్లించాలి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్యూఎస్ విద్యార్థులు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది.ఏప్రిల్ 15 తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రాత పరీక్ష ఏప్రిల్ 20, 2025వ తేదీన జరగుతుంది. ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించిన రాత పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. ఇక 7 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు… మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు. మండల కేంద్రాల్లోని ఆదర్శ పాఠశాలలు ఎగ్జామ్ సెంటర్లుగా ఉంటాయి.
మోడల్ స్కూల్ ప్రవేశాలు - కొత్త తేదీలివే:
- మోడల్ స్కూల్స్ ప్రవేశాలు - 2025- 2026 విద్యా సంవత్సరం.
- ప్రవేశాలు కల్పించే తరగతులు - 6, 7, 8, 9, 10.
- దరఖాస్తు విధానం - ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు తుది గుడువు - 20 మార్చి 2025.
- దరఖాస్తు ఫీజు - ఓసీ విద్యార్థులు రూ. 200 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఈడబ్యూఎస్ విద్యార్థులు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది.
- హాల్ టికెట్లు డౌన్లోడ్ - 15 ఏప్రిల్ 2025.
- పరీక్ష తేదీ - 20 ఏప్రిల్, 2025