Telangana SSC Hall Tickets 2025 : తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. BSE అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 21వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈసారి మొత్తం 4.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

తెలంగాణ పదో తరగతి హాల్ టికెట్లు 2025
మార్చి 21 నుంచి పరీక్షలు….
మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తవుతుాయి. ఈ ఏడాది 4.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్ లీకేజ్ వంటి వాటికి ఎలాంటి అస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టనున్నారు.
టెన్త్ హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- విద్యార్థులు ముందుగా బీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- పదో తరగతి హాల్ టికెట్లు - 2025 ఆప్షన్ పై నొక్కాలి.
- రెగ్యులర్ తో పాటు ప్రైవేటు, ఒకేషనల్ హాల్ టికెట్లు కనిపిస్తాయి. మీరు ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
- మీ జిల్లా, స్కూల్ పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి. మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
ఇక ఇప్పటికే విద్యాశాఖ టెన్త్ వార్షిక షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, 26న మ్యాథ్స్ పరీక్ష జరగనుంది. మార్చి 28న ఫిజిక్స్, 29న బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.
పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ 2025 :
- 21-03-2025 ఫస్ట్ లాంగ్వేజ్
- 22-03-2025 సెకండ్ లాంగ్వేజ్
- 24-03-2025 థర్డ్ లాంగ్వేజ్
- 26-03-2025 మ్యాథమేటిక్స్
- 28-03-2025 ఫిజికల్ సైన్స్
- 29-03-2025 బయోలాజికల్ సైన్స్
- 02-04-2025 సోషల్ స్టడీస్.