TG ECET 2025 Updates: తెలంగాణ ఈసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు... ఏప్రిల్ 19 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆపరాద రుసుంతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. మే 12వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణలో ఈసెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు బీఎస్సీ మ్యాథ్స్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. ఈ ఎంట్రెన్స్ ద్వారా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కల్పిస్తారు.
ముఖ్య తేదీలు
ఉన్నత విద్యామండలి తరపున ఈ ఏడాది ఉస్మానియా యూనివర్శిటీ పరీక్ష బాధ్యతలను చూడనుంది. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 19వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా చెల్లించవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర విభాగాల అభ్యర్థులు రూ.900 చెల్లించాలి. రూ. 500 ఆపరాద రుసంతో ఏప్రిల్ 26 వరకు, రూ. 1000 ఆపరాద రుసుంతో మే 2వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 28వ తేదీ నుంచి మే 2 వరకు దరఖాస్తును ఎడిట్ చేసుకోవచ్చు.
ఈసెట్ ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి... మే 6వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.మే 12వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య పరీక్షను నిర్వహిస్తారు. టీజీ ఈసెట్ వెబ్ సైట్ లో వివరాలను చెక్ చేసుకోవచ్చు.
- అప్లికేషన్ ఫీజు పేమెంట్ లింక్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజు చెల్లించాలి.
- ఆ తర్వాత “Fill The Application Form”పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత… అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
- డౌన్లోడ్ లేదా ప్రింట్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.