ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానంలో ఉండే సంస్థ. ఇది రాష్ట్రంలోని అన్ని దిగువ కోర్టులను పర్యవేక్షిస్తూ, పౌరుల హక్కులను కాపాడే ముఖ్యమైన బాధ్యతను నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం అందిస్తుంది. హైకోర్టు కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
హైకోర్టులో ఉద్యోగాలు ప్రధానంగా జ్యుడీషియల్, నాన్-జ్యుడీషియల్ పోస్టులుగా విభజించబడతాయి. నాన్-జ్యుడీషియల్ కేటగిరీలో కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. ఇవి యువతకు ఎక్కువగా అందుబాటులో ఉండే అవకాశాలు. మంచి జీతం, గౌరవప్రదమైన ఉద్యోగం కోరుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. అర్హతలు ఉన్న అభ్యర్థులు చివరి తేదీలకు ముందే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
ఖాళీల వివరాలు.
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా - 20 పోస్టులు
ట్రాన్స్‌ఫర్ (బదిలీ) ద్వారా - 12 పోస్టులు
దరఖాస్తు విధానం & చివరి తేదీలు..
ఆఫ్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 17, 2026
ఆన్‌లైన్ నమోదు (రిజిస్ట్రేషన్) చివరి తేదీ: ఏప్రిల్ 19, 2026
ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తరువాత ప్రింట్ తీసుకుని, అవసరమైన పత్రాలతో పోస్టు ద్వారా హైకోర్టుకు పంపాలి
విద్యార్హతలు..
అభ్యర్థులు క్రింది అర్హతలలో ఏదో ఒకటి కలిగి ఉండాలి:
ఆర్ట్స్ / సైన్స్ / కామర్స్‌లో డిగ్రీ
ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్ - 45 WPM
కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత
ట్రాన్స్‌క్రిప్షన్ (శ్రుతిలేఖనం) సామర్థ్యం అవసరం
వయోపరిమితి..
జనవరి 1, 2026 నాటికి 18 నుండి 42 సంవత్సరాలు
వయో సడలింపులు..
SC / ST / BC / EWS - 5 సంవత్సరాలు
దివ్యాంగులకు - 10 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు..
OC / BC / EWS - ₹600
SC / ST / దివ్యాంగులు - ₹400
ఎంపిక విధానం..
షార్ట్‌హ్యాండ్ డిక్టేషన్ టెస్ట్
కంప్యూటర్‌లో ట్రాన్స్‌క్రిప్షన్ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
జీతం (Salary)..
ఎంపికైన అభ్యర్థులకు నెలకు:
₹57,100 నుంచి ₹1,47,760 వరకు ఆకర్షణీయమైన జీతం
అదనపు ముఖ్యాంశాలు..
దరఖాస్తు ఫారమ్‌ను సరైన విధంగా నింపి, గెజిటెడ్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్ల కాపీలు తప్పనిసరిగా జతచేయాలి
అప్లికేషన్‌లో తప్పులు ఉంటే తిరస్కరించే అవకాశం ఉంది
అనుభవం ఉన్న అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యం ఉండొచ్చు
ప్రభుత్వ నియమాలు ప్రకారం రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి
పోస్టింగ్ ప్రధానంగా హైకోర్టు లేదా సంబంధిత జ్యుడీషియల్ కార్యాలయాల్లో ఉంటుంది
ఎంపికైన వారికి ఇతర అలవెన్సులు (DA, HRA మొదలైనవి) కూడా వర్తిస్తాయి
లేదా 3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల లా డిగ్రీ
నైపుణ్యాలు (Skills)..
ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 180 పదాలు (WPM)
లేదా కనీసం 150 WPM ఉన్నవారు కూడా అర్హులు

