Indian Bank Recruitment 2024 : ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ ప్రారంభమైంది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మెుత్తం 300 పోస్టులకుగానూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ ఖాళీలు ఉన్నాయి.
నిరుద్యోగులకు ఇండియన్ బ్యాంక్ శుభవార్త చెప్పింది. పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఆగస్టు 13న నోటిఫికేషన్ జారీ చేశారు. ఇండియన్ బ్యాంక్ 300 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్(LBO) స్కేల్ 1 రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఆగస్టు 13 నుంచి ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 2గా నిర్ణయించారు.
అర్హతలు ఇవే
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 అర్హత ప్రమాణాల ప్రకారం అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి గ్యాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థి వయసు జులై 1, 2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వయో సడలింపు అందుబాటులో ఉంటుంది.
మెుత్తం ఖాళీల్లో తమిళనాడుకు 160, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు 50, మహారాష్ట్రకు 40, కర్ణాటకకు 35, గుజారాత్‌కు 15 ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ 2024 నాలుగు దశల ఎంపిక ప్రక్రియను కలిగి ఉంటుంది. ఇందులో రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. రాత పరీక్ష మెుత్తం 200 మార్కులకు, ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
స్టెప్ 1 : ముందుగా indianbank.in అధికారిక వెబ్‌సైట్ వెళ్లాలి.
స్టెప్ 2 : ఆపై హోమ్ పేజీలో నావిగేట్ చేసి ఆన్‌లైన్‌లో అప్లై లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3 : లాగిన్ ఆధారాలను రూపొందించేందుకు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి.
స్టెప్ 4 : మీరు ఇమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ అందుకుంటారు.
స్టెప్ 5 : పూర్తయిన తర్వాత, అవసరమైన ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయండి, దరఖాస్తు ఫారమ్ పూరించాలి.
స్టెప్ 6 : ఫారమ్ నింపేటప్పుడు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
స్టెప్ 7 : ఫీజు చెల్లించిన తర్వాత ఫారమ్ సమర్పించాలి. తర్వాత అది పీడీఎఫ్ డౌన్లోడ్ చేయండి.
స్టెప్ 8 : తదుపరి రిక్రూట్‌మెంట్ ఎంపిక ప్రాసెసింగ్ కోసం పేజీ ప్రింటవుడ్ తీసుకోండి.