- బీటెక్ ప్రవేశాలపై హైదరాబాద్ లోని జేఎన్‌టీయూ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదల చేసింది. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు కోర్సులు, ఫీజుల వివరాలను ప్రకటించింది.
(1 / 6)
ఇంజినీరింగ్ కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లకు హైదరాబాద్ లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ షెడ్యూల్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ప్రవేశాలను పొందవచ్చని తెలిపింది.
(2 / 6)
ఇవాళ్టి(ఆగస్టు 30) నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని జేఎన్టీయూ హైదరాబాద్ పేర్కొంది. ఈ మేరకు కోర్సులు, ఫీజుల వివరాలను ప్రకటించింది.
(3 / 6)
స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా సీట్లు పొందే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు. మొత్తం ఫీజును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. మొదట వచ్చిన వారికే తొలి ప్రాధాన్యం ఉంటుంది.
(4 / 6)
అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్‌లో ధ్రువీకరణపత్రాలతో హాజరుకావాలి.
(5 / 6)
పది, టెన్త్, స్టడీ సర్టిఫికెట్స్ తో పాటు ఈఏపీసెట్ ర్యాంక్ కార్డులను తీసుకెళ్లాల్సి ఉంటుంది. కుల ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాలి.
(6 / 6)
కూకట్‌పల్లి, సుల్తాన్‌పూర్ కాలేజీల్లో ఆగస్టు 30వ తేదీన సీట్లను భర్తీ చేస్తారు. ఇక జగిత్యాల, మంథని కాలేజీల్లో ఆగస్టు 31న, వనపర్తి, రాజన్న సిరిసిల్ల, పాలేరు, మహబూబాబాద్‌లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సెప్టెంబర్ 2న స్పాట్ అడ్మిషన్స్ ద్వారా సీట్లను భర్తీ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. https://jntuh.ac.in/admissions# వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.