RGUKT Admissions : రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ల్లో ప్రవేశాలకు సంబంధించిన మూడో దశ (ఫేజ్-3) కౌన్సెలింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తోన్నారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక యూనివర్సిటీ(ఆర్‌జీయూకేటీ) పరిధిలోని నాలుగు క్యాంపస్‌ల్లో చేరేందుకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు ఆగస్టు 12 ఆఖరు తేదీగా నిర్వహించారు.
మొదటి రెండు దశల కౌన్సెలింగ్ లు ముగిశాయి. దీంతో రెండు కౌన్సెలింగ్ ల అనంతరం మిగిలిన 309 సీట్లను భర్తీ చేసేందుకు మూడో దశ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆర్‌జీయూకేటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆగస్టు 12 తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మొదటి, రెండో దశల్లో సీట్లు పొందిన విద్యార్థులు కూడా క్యాంపస్ మార్పునకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి ఆగస్టు 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే మొదటి, రెండో విడతల్లో ఎంపికైన అభ్యర్థులు, ఇంకా క్యాంపస్‌లకు రిపోర్టు చేయని అభ్యర్థులు కూడా ఆగస్టు 12 తేదీ సాయంత్రం 5 గంటలలోపు మూడో దశ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ క్యాంపస్‌ల్లో ఒక్కో క్యాంపస్‌లో 1,000 సీట్లు చొప్పున నాలుగు వేలు సీట్లు ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా పది శాతం సీట్లు ఒక్కో క్యాంపస్‌కు 100 సీట్లు చొప్పున 400 సీట్లకు కలిపితే, మొత్తం 4,400 సీట్లు ఉన్నాయి. తొలి విడత కౌన్సెలింగ్లో మొత్తం 4,140 మంది విద్యార్థులు పాల్గొనగా, వీరిలో 3,396 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. మిగిలిన 753 సీట్లకు రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండో దశ కౌన్సెలింగ్లో 444 అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇంకా 309 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ 309 సీట్లకు మూడో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆగస్టు 12 లోపు దరఖారస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండో దశలో ఎంపికైన విద్యార్థులు ఈనెల 19, 20 తేదీల్లో ఆయా క్యాంపస్‌ల్లో రిపోర్టు చేసుకోవాలని, 21 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని ఆర్‌జీయూకేటీ సెట్ అడ్మిషన్ కన్వీనర్ ఎస్.అమరేంద్ర కుమార్ తెలిపారు.
మూడో దశ కౌన్సెలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://admissions24.rgukt.in/ind/Registration ద్వారా చేసుకోవచ్చు. అభ్యర్థులు
యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://admissions24.rgukt.in/ind/Preferences ద్వారా క్యాంపస్ మార్చుకోవడానికిని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
రిజర్వేషన్ల అమలు ఇలా
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు రిజర్వేషన్లను ఇలా అమలు చేస్తారు. ఎస్‌సీలకు 15 శాతం, ఎస్‌టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు. బీసీల్లో 29 శాతంలో కూడా బీసీ-ఏకి 7 శాతం, బీసీ-బీకి 10 శాతం, బీసీ-సీకి 1 శాతం, బీసీ-డీకి 7 శాతం, బీసీ-ఈకి 4 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేశారు. వికలాంగులకు 5 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2 శాతం, ఎన్‌సీసీ విద్యార్థులకు 1 శాతం, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటా కింద 0.5 శాతం సీట్లను కేటాయిస్తారు. అలాగే ప్రతి కేటగిరీలోనూ 33.33 శాతం సీట్లను బాలికలకు కేటాయిస్తారు.
కోర్సులు
పీయూసీ-బీటెక్ రెండు కోర్సుల్లో బ్రాంచ్‌లు ఉంటాయి. రెండేళ్లు పీయూసీ, నాలుగేళ్లు బీటెక్ కలిపి మొత్తం ఆరేళ్లు ట్రిపుల్ ఐటీలో విద్యాను అభ్యసించవచ్చు. పీయూసీ ఎంపీసీ, బైపీసీ కోర్సులతో సమానంగా మేథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, లైఫ్ సైన్స్ ప్రత్యేక కోర్సులు ఉంటాయి. బీటెక్‌లో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు ఉంటాయి.
ఫీజులు ఎలా?
ట్రిపుల్ ఐటీల్లో చేరే విద్యార్థులకు ఫీజులు ఇలా ఉంటాయి. పీయూసీకి ట్యూషన్ ఫీజు ఒక్కో ఏడాదికి రూ.45 వేలు ఉంటుంది. బీటెక్ విద్యకు ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ.50 వేలు ఉంటుంది. ఇతర రాష్ట్రాల అభ్యర్థులకు ఏడాదికి ట్యూషన్ ఫీజు రూ.1.50 లక్షలు ఉంటుంది.
అదనపు సమచారం కోసం సంప్రదించండి
యూనివర్సిటీ అధికారిక email-admissions@rgukt.inకు మీ సమస్యపై సంప్రదించొచ్చు. ఈ మెయిల్ చేసేటప్పుడు RGUKT అప్లికేషన్ నెంబర్, పేరు, పదో తరగతి హాల్ టిక్కెట్టు నెంబర్, మొబైల్ నెంబర్, మీ సమస్య ఏంటో రాయాల్సి ఉంటుంది. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని వేళల్లో ఫోన్ నెంబర్లను 97035 42597, 97054 72597 సంప్రదించొచ్చు.