Tata Curvv EV price in Hyderabad : టాటా కర్వ్ ఈవీ కూపే ఎస్యూవీ కొనాలని చూస్తున్నారా? అయితే హైదరాబాద్లో టాటా కర్వ్ ఈవీ ఆన్రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో రారాజుగా కొనసాగుతున్న టాటా మోటార్స్, కొత్తగా మరో మోడల్ని లాంచ్ చేసింది. దీని పేరు టాటా కర్వ్ ఈవీ. ఇదొక కూపే ఎస్యూవీ. కొత్త డిజైన్, సూపర్ కూల్ ఫీచర్స్ ఉండటంతో ప్రజలు ఈ కర్వ్ ఈవీపై ఆసక్తి చూపిస్తున్నారు. మరి మీరు కూడా టాటా కర్వ్ ఈవీని కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్లో కర్వ్ ఈవీ ఆన్రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్లో టాటా కర్వ్ ఈవీ ఆన్రోడ్ ప్రైజ్..
టాటా కర్వ్ ఈవీ క్రియేటివ్ 45 కేడబ్ల్యూ- రూ. 18,39,925
టాటా కర్వ్ ఈవీ అకంప్లీష్డ్ 45 కేడబ్ల్యూ- రూ. 19.45 లక్షలు
టాటా కర్వ్ ఈవీ అకంప్లీష్డ్ 55 - రూ. 20.24 లక్షలు
టాటా కర్వ్ ఈవీ అకంప్లీష్డ్ ప్లస్ ఎస్ 45- రూ. 20.28 లక్షలు
టాటా కర్వ్ ఈవీ అకంప్లీషీడ్ ప్లస్ ఎస్ 55- రూ. 21.01 లక్షలు
టాటా కర్వ్ ఈవీ ఎంపవర్డ్ ప్లస్ 55- రూ. 22.33 లక్షలు
ఎంపవర్డ్ ప్లస్ ఏ 55- రూ. 23.11 లక్షలు.
అంటే హైదరాబాద్లో టాటా కర్వ్ ఈవీ కూపే ఎస్యూవీ బేస్ వేరియంట్ ఆన్రోడ్ ప్రైజ్ ధర రూ. 18.3 లక్షల నుంచి టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 23.11 లక్షల వరకు ఉంటుందని అర్థం.
సాధారణంగా వెహికల్‌కి ఎక్స్‌షోరూం ప్రైజ్, ఆన్రోడ్ ప్రైజ్‌లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్‌ని లాంచ్ చేసే సమయంలో ఆటోమొబైల్ సంస్థలు కేవలం ఎక్స్‌షోరూం ధరలే చెబుతాయి. కాగా ఆన్రోడ్ ప్రైజ్ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటుంది. అందుకే కస్టమర్లు వెహికిల్‌ని కొనే ముందు, ఎక్స్‌షోరూం ప్రైజ్ కాకుండా ఆన్రోడ్ ప్రైజ్ తెలుసుకుని బడ్జెట్ వేసుకోవాలి. సమీప డీలర్షిప్ షోరూమ్స్ని సందర్శిస్తే.. ఆ సమయంలో వెహికిల్‌పై ఏవైనా ఆఫర్స్ ఉన్నాయా? అనేది కూడా తెలుస్తుంది. అది ఖర్చు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
టాటా కర్వ్ ఈవీ- వేరియంట్లు వాటి ఫీచర్లు..
టాటా కర్వ్ ఈవీ కూపే ఎస్యూవీ బేస్ వేరియంట్ క్రియేటివ్ ఎక్స్‌షోరూం ధర రూ.17.49 లక్షలు. ఇందులో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 17 ఇంచ్ స్టీల్ వీల్స్ ఉన్నాయి. భద్రతా ఫీచర్లలో 6 ఎయిర్ బ్యాగులు, ఈఎస్పీ, డ్రైవర్ డోజ్-ఆఫ్ అలర్ట్, అన్ని వీల్స్‌కి డిస్క్ బ్రేక్లు ఉన్నాయి. లోపల 7 ఇంచ్ టచ్‌స్క్రీన్, 7 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రియర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి.
కన్వీనియన్స్ ఫీచర్లలో ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఆటో హోల్డ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి. టాటా కర్వ్ ఈవీలో వెహికల్ టు వెహికల్, వెహికల్ టు లోడ్ ఛార్జింగ్, టీపీఎంఎస్, ఐఆర్ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అధునాతన టెక్నాలజీ ఉంది.