తేనెల తేటల మాటలతో - లిరిక్స్ - దేశభక్తి గేయాలు
Friday, September 20, 2024
తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా
సాగరమే ఘాల చుట్టుకుని
సురగంగ చీరగా మలచుకుని
గీతాగానం పాడుకుని
మన దేవికి ఇవ్వాలి హారతులు
గాఁగ జటాధర భావనతో
హిమశైల శిఖరమే నిలబడగా
గల గల పారే నదులన్నీ
ఒక బృందగానమే చేస్తుంటే
ఎందరో వీరుల త్యాగ ఫలం
మన నేటి స్వేచ్ఛకే మూలబలం
వారందరిని తలచుకుని
మన మానసవీధిని నిలుపుకుని
తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకుని ఇక జీవనయానం చేయుదమా
Tags