Lyrics in Telugu:
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ సశ్యామల సుశ్యామ చలశ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల (2)
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా (2)
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ (2)
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ (2)
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణా (2)
Lyrics in English:
Jaya Jaya Jaya Priya Bharata Janayitri Divya dhaatri
Jaya Jaya Jaya Shata sahasra nara naari hrudaya netri
Jaya Jaya sashyaamala sushyaama chalaschelaanchala
Jaya vasanta kusuma lata chalita lalita churna kuntala (2)
Jaya madeeya hrudayaasaya laakshaaruna padayugala (2)
Jaya dishaanta gata shakunta divya gaana paritoshana (2)
Jaya gaayaka vaitaalika gala vishaala pada viharana (2)
Jaya madeeya madhura geya chumbita sundara charana (2)
Meaning of Jaya Jaya Jaya Priyabhaarata in Telugu:
మాకు ప్రియమైన భారతమాతా, దేవభూమీ,
నీకు జయమగు గాక
లక్షలాది స్త్రీపురుషుల హృదయాలకు
కనులవంటి దానా, నీకు జయమగు గాక
శ్యామలవర్ణా, కదలెడు ముదురు ఆకుపచ్చ చెరగు
గల దానా, నీకు జయమగు గాక
వసంతకాలములో విరిసిన పూలను తురిమిన
అందమైన వెండ్రుకలు గల దానా నీకు జయమగు గాక
నా మనసునందలి అభిలాషల ఎర్రని లత్తుకతో
అలంకరించబడిన పాదములు గలదానా నీకు జయము
దీశాంతములకు వెళ్ళిన పక్షుల అమరగానముతో
తృప్తి బొందిన దానా, జయము
గాయకుల, కవుల కంఠములలో వెలువడు
పాటలలో విహరించుదానా, జయము
నా మధురగానముతో ముద్దుపెట్టబాదిన
అందమైన చరణము గల దాన,
నీకు జయమగు గాక