TG Inter Exams 2025 : ఇంటర్ పరీక్షలపై కీలక అప్డేట్ - ప్రాక్టికల్స్‌కు హాజరుకాకపోతే మళ్లీ అనుమతి..

TG Inter Exams 2025 : ఇంటర్ పరీక్షలపై కీలక అప్డేట్ - ప్రాక్టికల్స్‌కు హాజరుకాకపోతే మళ్లీ అనుమతి..

P Madhav Kumar


TG Inter Practical Exams 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మొత్తం 4 విడతల్లో వీటిని పూర్తి చేయనున్నారు. అయితే ప్రాక్టికల్స్ కు హాజరుకాని అభ్యర్థుల విషయంలో ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. సరైన కారణంతో ప్రాక్టికల్స్‌కు గైర్హాజరైతే మళ్లీ అనుమతి ఇస్తామని పేర్కొంది.

తెలంగాణ ఇంటర్ పరీక్షలు 2025
తెలంగాణ ఇంటర్ పరీక్షలు 2025

తెలంగాణలోని ఇంటర్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ పరీక్షలు మొదలవుతుండగా… మొత్తం నాలుగు విడతల్లో వీటిని పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత వార్షిక పరీక్షలను నిర్వహించనున్నారు.

విద్యార్థులకు కీలక అప్డేట్….

ప్రస్తుతం ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. విద్యార్థులు ఎవరైనా తమకు కేటాయించిన రోజున ప్రాక్టికల్స్ కు హాజరుకాకపోతే… మరోసారి అనుమతి ఇస్తామని తెలిపింది. అయితే ఇందుకు స్పష్టమైన, సరైన కారణం ఉంటేనే మరో తేదీలో రాసేందుకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. సరైన కారణాలు చూపిన అభ్యర్థికి మరో తేదీలో ఎగ్జామ్స్ రాసే అవకాశం ఇస్తామని పేర్కొంది.

మొదటి విడత ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఇక రెండో విడత చూస్తే రేపు ప్రారంభమైన… ఫిబ్రవరి 12 వరకు ఉంటుంది. ఇక మూడో విడుత 13వ తేదీ నుంచి 17 వరకు నిర్వహించారు. ఇక చివరి విడత ఫిబ్రవరి 18వ తేదీ నుంచి 22 మధ్య నిర్వహిస్తారు. అయితే ఆయా తేదీల్లో పరీక్షలు ఉన్న విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే… కాలేజీలు లేదా బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్తే రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంటుంది.

ల్యాబ్స్ లో సీసీ కెమెరాలు:

మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్స్ నేపథ్యంలో బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం ల్యాబ్స్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని ఎగ్జామ్స్ సెంటర్లలో వీటిని నెలకొల్పారు. ప్రాక్టికల్స్‌లో అక్రమాలు జరగకూడదన్న ఉద్దేశంతోనే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లను కూడా ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో ఉంచింది. కాలేజీల్లోనే కాకుండా నేరుగా కూడా విద్యార్థులు వీటిని పొందవచ్చు. తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లోకి వెళ్లి వీటిిని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఇక మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఇక జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమస్ వ్యాల్యూస్ పరీక్ష, 30న పర్యావరణ పరీక్ష పూర్తైంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటిని కూడా బోర్డు సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow